న్యూస్ బాక్స్ ఆఫీస్

రాక్షసుడు కలెక్షన్స్: 15.2 కోట్ల టార్గెట్…19 రోజుల్లో వచ్చింది ఇది!!

కెరీర్ మొదలు పెట్టి 5 ఏళ్ళు పైనే అవుతున్నా క్లీన్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా బిజినెస్ ని అందుకోలేక పోయింది, ఇలాంటి టైం లో నిర్మాతలు సినిమా బిజినెస్ లో 2 కోట్ల వర్త్ ఓన్ రిలీజ్ ఉందని అనౌన్స్ చేశారు.

దాంతో ఇప్పుడు సినిమా బిజినెస్ మొత్తం మీద 14.2 కోట్లు కాగా సినిమా 15.2 కోట్ల టార్గెట్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 రోజులను పూర్తి చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 19 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో….

12.83 కోట్ల షేర్ ని అందుకుంది, వరల్డ్ వైడ్ గా 13.94 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది, మూడో వారం వర్కింగ్ డేస్ లో కూడా సినిమా స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తుంది, 19 వ రోజు సినిమా ఆల్ మోస్ట్ 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని సూపర్బ్ గా హోల్డ్ చేసింది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…

మరో 1.26 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది మూడో వీక్ పూర్తి అయ్యే సరికి జరుగుతుంది, లేక పొతే 4 వ వీకెండ్ లో అయినా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది ఈ సినిమా, ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటే ఈ పాటికే బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది.

మొత్తం మీద సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఇప్పుడు మొట్ట మొదటి బ్రేక్ ఈవెన్ అండ్ క్లీన్ హిట్ మూవీ గా నిలవబోతుందని చెప్పొచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుంది అన్నది ఎంత త్వరగా బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది అన్న దాని పై ఆధార పడి ఉంటుంది.

Leave a Comment