న్యూస్ బాక్స్ ఆఫీస్

రాజావారు – రాణిగారు కలెక్షన్స్: టార్గెట్ 1.8 కోట్లు…4 రోజుల్లో వచ్చింది ఇది!!

టీసర్ ట్రైలర్ తో ఆకట్టుకున్న రీసెంట్ మూవీస్ లో చిన్న మూవీ “రాజావారు – రాణిగారు” కూడా ఒకటి, మంచి ఫీల్ గుడ్ విలేజ్ బేసుడ్ లవ్ స్టొరీ అయిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకోగా చూసిన ఆడియన్స్ అందరు మంచి ఫీల్ గుడ్ మూవీ అంటూ సినిమా ని బాగానే మెచ్చుకున్నారు.

కాగా అన్ సీజన్ అండ్ లో బజ్ ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండి వీకెండ్ వరకు మరీ అద్బుతం కాక పోయినా కానీ ఉన్నంతలో కొంచం బెటర్ కలెక్షన్స్ నే సాధిస్తూ వీకెండ్ ని పర్వాలేదు అనిపించే విధంగా ముగించగా సినిమా వర్కింగ్ డే అయిన…

4 వ రోజు కూడా ఉన్నంతలో ఓకే అనిపించే కలెక్షన్స్ ని సాధించింది. కానీ సినిమా ఓవరాల్ బిజినెస్ 1.5 కోట్లు అవ్వడం తో సినిమా వీకెండ్ అండ్ వర్కింగ్ డే కలెక్షన్స్ తో కలిపి మొత్తం మీద 70 లక్షల దాకా షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించింది.

ఒకసారి సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
#RajaVaaruRaniGaaru Day 4 Ap-TG: 0.06Cr
?Total 4 Days ApTg Collections: 0.51Cr
?Day 4 WW collections: 0.07Cr
?Total 4 Days WW collections: 0.70Cr
?Break Even: 1.8cr~
Need:- 1.10Cr Needed for Break Even
?Total Gross: 1.24Cr+
ఇదీ మొత్తం మీద సినిమా 4 రోజుల కలెక్షన్స్ లెక్కలు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 1.1 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ వర్కింగ్ డేస్ లో జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లోనే కలెక్షన్స్ ఉండటం తో లాంగ్ రన్ ఉంటుందా ఉండదా అన్నది అనుమానంగా మారింది. ఫైనల్ గా యావరేజ్ స్టేటస్ రావాలి అన్నా సినిమా 1.4 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment