న్యూస్

రాధే శ్యామ్ టీసర్ రివ్యూ….అరాచకం!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా రాధే శ్యామ్ సినిమా జనవరి 14 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ఎట్టకేలకు ప్రభాస్ పుట్టిన రోజు అయిన ఈ రోజు న అనుకున్న టైం కన్నా ముందే రిలీజ్ అయ్యింది. ఇక టీసర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్…

8 భాషల సబ్ టైటిల్స్ తో ఇంగ్లిష్ వాయిస్ ఓవర్ తో ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ అవ్వగా ప్రభాస్ వాయిస్ ఓవర్ పవర్ ఫుల్ గా మెప్పించింది… పాల్మిస్ట్ ఆస్ట్రోలజర్ గా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో ప్ర్రభాస్ కి ఒక మనిషి పుట్టినప్పటి నుండి ఎప్పుడు ఎలా చనిపోతాడు…

అన్న అన్ని విషయాలు తెలుస్తాయి… ఒక మనిషి గుండె చప్పుడు, ఫెల్యూర్స్, చావుని కూడా సెన్స్ చేసే శక్తి కలిగిన హీరో అన్ని తెలిసినా ప్రేమ లో పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్నది సినిమా కథ గా టీసర్ చూసిన తర్వాత ఆల్ మోస్ట్ స్టొరీ పాయింట్ రివీల్ అయింది.

కానీ టీసర్ లో విజువల్స్ అండ్ గ్రాండియర్, ఎక్స్ ట్రా ఆర్డినరీ బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం జస్ట్ వాయిస్ ఓవర్ తోనే సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో చెప్పిన ప్రభాస్ కచ్చితంగా కంటెంట్ క్లిక్ అయితే ఆల్ ఇండియా లెవల్ లో ఊహకందని ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన టీసర్…

అందరూ ఎదో లవ్ సీన్స్ తో టీసర్ కట్ ఉంటుందేమో అనుకున్నారు కానీ అందరి అంచనాలను మించే రేంజ్ లో టీసర్ కట్ తో సినిమా పై ఉన్న అంచనాలను మొత్తం మించిపోయేలా చేశారు. ఇక యూట్యూబ్ లో 24 గంటల్లో ఈ టీసర్ ఎలాంటి సంచలన రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి ఇక…

Leave a Comment