న్యూస్

రాధే శ్యామ్ Vs RRR….పాన్ ఇండియా మూవీస్ 24 గంటల గ్లిమ్స్ రిపోర్ట్ ఇదే!!

బాహుబలి తర్వాత టాలీవుడ్ నుండి వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. వాటిలో బాహుబలితో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే చేస్తూ ఉండగా మిగిలిన హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలను కమిట్ అవుతున్నారు. బాహుబలి తీసిన ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల…

కలయికలో అత్యంత భారీ ఎత్తున భారీ క్రేజ్ నడుమ రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 7 న ఆల్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుండగా వారం గ్యాప్ లో జనవరి 14 న రాధే శ్యామ్ కూడా ఆల్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది.

దాంతో రెండు సినిమాలు సంక్రాంతి పోరులో ఉండటం ఖాయం అవ్వగా రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అవ్వగా రాధే శ్యామ్ కూడా ముందుగా గ్లిమ్స్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది, ఒకసారి ఈ రెండు సినిమాల గ్లిమ్స్ రిపోర్ట్ 24 గంటలవి గమనిస్తే…

రీసెంట్ గా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ 3 ఛానెల్స్ లో రిలీజ్ అయ్యి 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 12.44 మిలియన్ వ్యూస్ ని 987.7K లైక్స్ ని సొంతం చేసుకోగా అంతకుముందు ఫిబ్రవరి టైం లో వచ్చిన రాధే శ్యామ్ సినిమా గ్లిమ్స్ 5 భాషల్లో 2 ఛానెల్స్ లో రిలీజ్ అయ్యింది… ఓవరాల్ గా అన్నీ కలిపి 17.01 మిలియన్ వ్యూస్ ని…

అలాగే 991.5K లైక్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో రాధే శ్యామ్ గ్లిమ్స్ రికార్డ్ ఓవరాల్ గా ఇండియాలో అన్ని కలిపి ఇప్పటికీ టాప్ లోనే ఉంది, ఆర్ ఆర్ ఆర్ ఈ రికార్డ్ ను అవలీలగా బ్రేక్ చేస్తుంది అనుకున్నా అలా జరగలేదు, మరి ఈ సంక్రాంతి మూవీస్ అప్ కమింగ్ ట్రైలర్స్ ఎలాగూ రిలీజ్ అవుతాయి అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

Leave a Comment