గాసిప్స్ న్యూస్

రామ్ చరణ్ కొత్త సినిమా…ఫైనల్ రేసులో ముగ్గురు!!

టాలీవుడ్ లో ఈ లాక్ డౌన్ టైం లో మిగిలిన హీరోలు అందరూ కూడా తమ అప్ కమింగ్ ప్రాజెక్టులను ఓకే చేయడం లో బిజీ గా ఉండగా అందరూ కూడా దాదాపుగా సినిమాలను కమిట్ అవ్వగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మాత్రం అనేక రూమర్స్ వస్తున్నాయి కానీ అందులో ఏ సినిమా కూడా రామ్ చరణ్ ఇప్పటి వరకు కమిట్ కాలేదు. ఈ కరోనా టైం లో….

ఏ హీరో అప్ కమింగ్ మూవీ పై కూడా రానన్ని వార్తలు ఒక్క రామ్ చరణ్ పైనే వచ్చాయి అని చెప్పాలి. ప్రతీ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త సినిమా ఉంటుందని వార్తలు రాగా అందులో ఏవి కూడా నిజం కాలేదు.. ఇక ఇన్ని రూమర్స్ తర్వాత కూడా…

ఇప్పుడు రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ రేసులో ఎవరు ఉన్నారు అన్నది ఫుల్ క్లారిటీ అయితే లేదు కానీ ఓవరాల్ గా ఫైనల్ రేసులో మాత్రం ఇప్పుడు ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు అని చెప్పగలం, ఆ ముగ్గురిలో ఒకరు కన్ఫాం అయ్యే అవకాశం ఉంది.

ఆ ముగ్గురే వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి మరియు వెంకీ కొడుముల అని గట్టి టాక్ ఉంది. ఈ ముగ్గురు చెప్పిన కథలను రామ్ చరణ్ బాగానే ఇంప్రెస్ అయ్యాడు అని అంటున్నారు. ఇందులో ఇద్దరితో ఇది వరకే ఒక్కో సినిమా చేశాడు రామ్ చరణ్ అవి రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయిన సినిమాలే అవ్వడం విశేషం.

ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ కొడుముల చెప్పిన కథ మాత్రం మంచి ఎంటర్ టైనర్ అని అంటున్నారు. దాంతో మిగిలిన డైరెక్టర్స్ తో సినిమాల వార్తలు ఎలా ఉన్నా ఈ ముగ్గురిలోనే ఒకరితో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ లో స్ట్రాంగ్ టాక్ ఉంది…

Leave a Comment