గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

రామ్ లింగుస్వామి మూవీ బడ్జెట్…మరీ ఇంత ఏంటి సామి!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ కెరీర్ లో మొదటి 40 కోట్ల మూవీగా నిలవగా తర్వాత వచ్చిన రెడ్ మూవీ యావరేజ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అది కూడా 50% ఆక్యుపెన్సీ తోనే ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

తన క్రేజ్ ని బాక్ టు బాక్ హిట్స్ తో మరింత పెంచుకున్న రామ్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ ని అందరినీ ఆశ్యర్య పరుస్తూ ఫాంలో లేని తమిళ్ డైరెక్టర్ తో చేస్తున్నాడు. పందెం కోడి, ఆవారా ఫేం లింగుస్వామి డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ ని కమిట్ అయ్యాడు రామ్…

ఈ సినిమా ని తెలుగు తో పాటు తమిళ్ లో బైలింగువల్ గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా రామ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు అంటూ టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి ఎంతవరకు నిజం అవుతాయి అన్నది ఇంకా…

అఫీషియల్ గా కన్ఫాం అవ్వాల్సి ఉండగా ఏకంగా 80 కోట్ల భారీ బడ్జెట్ తో హై క్వాలిటీ అండ్ భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ఉండబోతుంది అంటున్నారు. రామ్ కెరీర్ లో చాలా సినిమాలు 20 నుండి 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన సినిమాలే… ఎప్పుడూ భారీగా నిర్మాతలను రిస్కులో పెట్టని రామ్ మొదటి సారి ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ మూవీతో రిస్క్ చేయబోతున్నాడు అని అంటున్నారు.

కానీ లాస్ట్ 2 సినిమాలు మరీ పాజిటివ్ టాక్ తెచ్చుకోకున్నా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా నాన్ థియేట్రికల్ బిజినెస్ లు కూడా బాగా జరగడంతో ఇప్పుడు ఇంత బడ్జెట్ తో రిస్క్ చేస్తున్నారు అంటున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతున్న ఈ సినిమా తో రామ్ తన మార్కెట్ ని తమిళ్ లో ఏర్పరచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

Leave a Comment