న్యూస్ స్పెషల్

రికార్డులు చెల్లాచెదురు…వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు!!

సోషల్ మీడియా లో గత రెండేళ్ళ లో చాలా తక్కువ సమయం లోనే యాక్టివ్ గా ఉంటూ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే రోజున మాత్రం నెవర్ బిఫోర్ ఎవర అనే రేంజ్ లో భారీ ట్రెండ్ ని చేపడుతూ పాత రికార్డు ల బెండు తీస్తూ కొత్త బెంచ్ మార్కు లను సెట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆ రికార్డులు మాములుగా లేవు..

ఫాస్టెస్ట్ 1 మిలియన్ ట్వీట్స్ నుండి ఇప్పటి వరకు అన్ని రికార్డులను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 24 గంటలు ముగియక ముందే అనేక రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. పుట్టిన రోజుల ట్రెండ్స్ విషయం లో ఇది వరకు…

పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ లో 10.51 మిలియన్ ట్వీట్స్ పోల్ అవ్వగా ఆ రికార్డ్ ను 7 గంటల వ్యవధిలోనే బ్రేక్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాంతో పాటే ఇండియా లో 11 మిలియన్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి బర్త్ డే ట్రెండ్ గా సరికొత్త రికార్డ్ ను నమోదు చేశారు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోరు ఏ రేంజ్ లో ఉందీ అంటే ఇంకా 24 గంటలు ముగియడానికి చాలా సమయం ఉండగా ప్రస్తుతం ట్వీట్ కౌంట్ 13 మిలియన్స్ రేంజ్ లో దూసుకు పోతుండటం విశేషం, కచ్చితంగా మొట్ట మొదటి 14 మిలియన్స్ నుండి అంతకుముందు లెక్క ఎంతవరకు వెళుతుందో చెప్పలేం కానీ ఆ రికార్డులు అన్నీ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక ఎన్టీఆర్ బర్త్ డే రోజున ప్రముఖల విషెస్ వచ్చినప్పటికీ అందరికీ షాక్ ఇస్తూ అప్ కమింగ్ మూవీస్ గురించిన అనౌన్న్స్ మెంట్స్ అయితే ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు, మరి రోజు ముగిసే సమయానికి కొత్త సినిమాల అప్ డేట్స్ ఏమైనా వస్తాయో లేవో చూడాలి..

Leave a Comment