న్యూస్ బాక్స్ ఆఫీస్

రికార్డ్ అలెర్ట్: 100 కోట్ల సింహాసనంపై పవర్ స్టార్…ఎన్నో అడ్డంకులు…అయినా టాలీవుడ్ నుండి రికార్డ్!!

పాండమిక్ తర్వాత టాలీవుడ్ వరుస విజయాలతో దుమ్ము లేపుతూ ఉండొచ్చు, ఇండియా లోనే వరుస హిట్స్ తో ఏ ఇండస్ట్రీ కి కూడా అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండొచ్చు కానీ వకీల్ సాబ్ సినిమా వచ్చే నెల రోజుల ముందు నుండి ఒక్కటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను థియేటర్స్ కి రప్పించింది, తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా జనాలను థియేటర్స్ కి ఆశించిన మేర రప్పించలేక పోయాయి.

ఇక వకీల్ సాబ్ రిలీజ్ టైం కి సెకెండ్ వేవ్ గట్టిగా రెచ్చిపోతూ ఉన్న టైం లో అనుకోకుండా ఆంధ్రలో అనేక అవరోధాలను ఎదురుకోవడం మొదలు పెట్టిన వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవన్నీ తట్టుకుని సాలిడ్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ను పూర్తీ చేసుకున్న తర్వాత…

టికెట్ రేట్లని భారీగా తగ్గించినా కానీ వాటిని కూడా తట్టుకుని స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి ఓవరాల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను….

ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా…టాలీవుడ్ తరుపున పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీ గా నిలిచింది, మొదటి మూడు నెలల సెన్సేషనల్ ఫ్లో లో వచ్చి ఉంటె అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా అనుకునే వాళ్ళు కానీ రిలీజ్ కి ముందు వచ్చిన అన్ని సినిమాలు విఫలం అవ్వడం…

ఇక ఈ సినిమా రిలీజ్ రోజు నుండి ఎదురుకుంటున్న పరిస్థితులను అన్నీ తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అధిగమించింది. ఇక సెకెండ్ వేవ్ గట్టిగా ఉన్న జనాలను థియేటర్స్ కి రప్పించే విషయంలో పవర్ స్టార్ తన పవర్ ని చూపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన కంబ్యాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాడు అని చెప్పాలి.

Leave a Comment