న్యూస్ స్పెషల్

రికార్డ్ కొట్టిన నాగచైతన్య…టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్!

2009 లో టాలీవుడ్ లోకి జోష్ సినిమా తో అడుగు పెట్టాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య, తొలి సినిమా తో కొద్ది వరకు ఆకట్టుకోగా రెండో సినిమా ఏమాయ చేసావే తో తొలి హిట్ కొట్టిన నాగ చైతన్య తర్వాత మాస్ బాట పట్టిన ప్రతీ సారి నిరాశ పరచగా లవ్ స్టొరీ తో ఎప్పటికప్పుడు హిట్ కొడుతూ ఎప్పుడూ లైం లైట్ లోనే ఉండేవాడు. మధ్యలో 100% లవ్ అండ్ తదాకా సినిమా లతో…

మంచి విజయాలను అందుకున్నా తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయిన టైం లో రెండేళ్ళ క్రితం రారండోయ్ వేడుక చూద్దాం తో మంచి కంబ్యాక్ ఇవ్వగా తర్వాత మళ్ళీ కొంచం స్లో డౌన్ అయిన టైం లో ఈ ఇయర్ మజిలీ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు…

తన కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచింది ఆ సినిమా, ఫైనల్ రన్ లో 40 కోట్లకి పైగా షేర్ అందుకున్న ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య పుట్టిన రోజు నవంబర్ 23 న జరగగా అక్కినేని ఫ్యాన్స్ భారీ ఎత్తున సోషల్ మీడియా లో ట్రెండ్ చేశారు.

ట్రెండ్ లో భాగంగా 24 గంటల్లో ఓవరాల్ గా 2 లక్షల 24 వేల రేంజ్ లో ట్వీట్స్ పుట్టిన రోజుపై పోల్ అవ్వగా ఇది టాలీవుడ్ మీడియం రేంజ్ టైర్ 2 హిరోలల్లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఇది వరకు రికార్డ్ నాని బర్త్ డే పేరిట ఉండేది.

ఆ రికార్డ్ ను బ్రేక్ చేయగా పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన శేఖర్ కమ్ములతో చేస్తున్న సినిమా గ్లిమ్స్, అలాగే వెంకీ మామ న్యూ టీసర్ లు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వరుస పెట్టి క్రేజీ మూవీస్ చేస్తున్న నాగ చైతన్య తర్వాత సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Leave a Comment