న్యూస్ స్పెషల్

రికార్డ్ కొట్టిన నాని ఫ్యాన్స్…నాచురల్ స్టార్ బర్త్ డే స్పెషల్!!

సహజ మైన నటనతో అందరి మెప్పు ని అతి తక్కువ సమయం లోనే సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఎలాంటి స్టార్ బ్యాక్ డ్రాప్ లేకుండా హీరో గా ఎదగడమే కాకుండా భారీ స్టార్ డం ని సొంతం చేసుకున్న హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. అసిస్టంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన నాని అష్టా చమ్మా సినిమా తో హీరోగా పరిచయం అవ్వగా ఇప్పుడు తన కెరీర్ లో…

ప్రతిష్టాత్మక 25 వ సినిమా వి ది మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేడు నాచురల్ స్టార్ నాని 36 వ పుట్టిన రోజు…. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ తర్వాత ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న మొదటి హీరో నాని.

మీడియం రేంజ్ హీరోలలో మొదటి 25 కోట్ల షేర్ ని భలే భలే మొగాడివోయ్ తో అందుకుని సంచలనం సృష్టించాడు. కెరీర్ లో చేసిన 24 సినిమాల్లో ఎక్కువ శాతం డిఫెరెంట్ మూవీస్ నే చేస్తూ వాటితో కూడా హిట్స్ ని సాధించాడు నాని, లాస్ట్ ఇయర్ జెర్సీ తో తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చి…

అందరి చేత శెభాష్ అనిపించుకున్న నాని పుట్టిన రోజు వేడుకలో ఫ్యాన్స్ భారీ ఎత్తున సోషల్ మీడియా లో ట్రెండ్ ని మొదలు పెట్టగా మీడియం రేంజ్ హీరోల పరంగా బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని నాని బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు ఫ్యాన్స్.. 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 48 వేల కి…

పైగా ట్వీట్స్ తో ఇది వరకు నాగచైతన్య బర్త్ డే ట్రెండ్ లో నమోదు అయిన 2 లక్షల 25 వేల ట్వీట్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను నమోదు చేశారు. త్వరలోనే వి ది మూవీ తో రానున్న నాని ఈ ఇయర్ “టక్ జగదీష్” మరియు “శ్యాం సింగ రాయ్” సినిమాలతో 2020 లో దుమ్ము లేపబోతున్నాడు.

Leave a Comment