న్యూస్ స్పెషల్

రికార్డ్ బ్రేకింగ్ ట్రెండ్…రామ్ ఫ్యాన్స్ ఊరమాస్!!

రీసెంట్ టైం లో సోషల్ మీడియా లో రోజు కో ట్రెండ్ జరుగుతున్న విషయం తెలిసిందే, హీరోల పుట్టిన రోజు వేడుకలు కావచ్చు లేక సినిమా ల యానివర్సరీ ట్రెండ్స్ కావచ్చు రోజు ఎదో ఒక ట్రెండ్ జరుగుతూనే ఉండగా అందులో కొత్త రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. స్టార్ హీరోల తో పాటు టైర్ 2 అండ్ టైర్ 3 హీరోల సినిమాల ట్రెండ్స్ తో పాటు పుట్టిన రోజు ట్రెండ్స్ కూడా జరుగుతున్నాయి.

రీసెంట్ గా జరిగిన టైర్ 2 బర్త్ డే ట్రెండ్స్ లో కొత్త రికార్డులు నమోదు అవ్వగా ఇప్పుడు లేటెస్ట్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టిన రోజు నేడు జరగగా నిన్న సాయంత్రం నుండి రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ ని చేపట్టారు. దాంతో 24 గంటలు పూర్తీ అయ్యే సరికి…

టైర్ 2 హీరోల విషయం లో సరికొత్త ట్రెండ్ రికార్డ్ ను సొంతం చేసుకుని ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫ్యాన్స్ సంచలనం సృష్టించారు. పాత రికార్డులను దాటేసి ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్కులను ఇతర హీరోల ఫ్యాన్స్ కి సెట్ చేశారు.

24 గంటలు పూర్తీ అయ్యే సరికి 6 లక్షల 46 వేల రేంజ్ లో ట్వీట్స్ ని పోల్ చేసి రామ్ ఫ్యాన్స్ దుమ్ము లేపారు, దాంతో టైర్ 2 హిరోల్లో బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేశారు. మొత్తం మీద టైర్ 2 అండ్ టైర్ 3 హీరోల విషయం లో బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ లను ఒకసారి గమనిస్తే…

1. #HappyBirthdayRAPO – 646k~
2. #HBDVijayDeverakonda: 445.3K
3. #HBDAkhilAkkineni: 265.4K
4. #HappyBirthdayNani: 248K
5. #HBDNagachaitanya : 225K
Tier 3
1. #HappyBirthdaySudheerBabu – 600k~
2. #HBDRajTarun – 251K~

ఇవీ ఓవరాల్ గా టైర్ 2 అండ్ టైర్ 3 హీరోల బర్త్ డే ట్రెండ్స్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ట్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన రామ్ ఇప్పుడు రెడ్ మూవీ తో లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి..

Leave a Comment