న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

రికార్డ్ బ్రేకింగ్….4 వ వారం మహర్షి థియేటర్స్ తెలిస్తే షాక్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపుతూ దూసుకు పోతుంది, కాగా 3 వారాలు ముగిసే సరికి సినిమా టోటల్ గా 98.8 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక సినిమా ఇప్పుడు 4 వ వారం లో అడుగు పెట్టగా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల నుండి భారీ పోటి ఎదురు అయినా కానీ సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసింది.

అందులో నైజాం ఏరియాలో 4 వ వారం రీసెంట్ బిగ్ మూవీస్ లో హైయెస్ట్ థియేటర్స్ ని హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, రంగస్థలం 4 వ వారం లో 90 కి అటూ ఇటూ గా థియేటర్స్ ని హోల్డ్ చేయగా మహర్షి ఏకంగా 135 థియేటర్స్ ని హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది.

ఇక సినిమా ఆంధ్రా లో 100 కి పైగా థియేటర్స్ ని సీడెడ్ లో 40 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది, టోటల్ గా రెండు రాష్ట్రాలలో 275 థియేటర్స్ కి పైగా హోల్డ్ చేసిన ఈ సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 45 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది,. టోటల్ గా ఇండియా లో 4 వ వారం లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 320 కి పైగా థియేటర్స్ లో పరుగును కొనసాగించ నుంది ఈ సినిమా…

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!