న్యూస్ బాక్స్ ఆఫీస్

రికార్డ్ రేటుకి అమ్ముడైన సోలో బ్రతుకే సో బెటర్…ఇక రిస్క్ మొత్తం వీళ్ళకే!!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక టాలీవుడ్ నుండి రిలీజ్ కి సిద్ధం అవుతున్న మొట్ట మొదటి సినిమా కానున్న విషయం అందరికీ తెలిసిందే, కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా కన్ఫాం చేయలేదు కానీ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన బిజినెస్ న్యూస్ ఇప్పుడు…

టాలీవుడ్ ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా హక్కులను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందని రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే, కాగా ఈ బిజినెస్ లో కంప్లీట్ సినిమా కి సంభందించిన అన్ని హక్కులను ఇప్పుడు జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందని సమాచారం…

కాగా సినిమా ను కంప్లీట్ గా ఏకంగా 38 కోట్ల భారీ రేటు కి సొంతం చేసుకుందట జీ నెట్ వర్క్, ఈ రేటు లో సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ మరియు థియేట్రికల్ రైట్స్ మొత్తం కూడా జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందట.

ఇక సినిమా బిజినెస్ కి నిర్మాతలకు ఏమి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. సినిమా అన్ని హక్కులను సొంతం చేసుకోవడంతో అయితే సినిమాను ఓన్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయోచ్చు లేదా థియేట్రికల్ బిజినెస్ ని ఏరియాల వారిగా అమ్ముకునే అవకాశం జీ కి ఉంది. మొత్తం మీద సాయి ధరం తేజ్ లాస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే సినిమా తో పోల్చితే…

మంచి డీల్ ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ కి సొంతం అయిందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ డేట్ ని థియేటర్స్ అన్నీ కంప్లీట్ గా రీ ఓపెన్ అవ్వగానే అనౌన్స్ చేసే అవకాశం ఉంది, ఇక జనాలు ఎంతవరకు థియేటర్స్ కి వచ్చి సినిమాను చూస్తారు అన్నది ఆసక్తిగా మారబోతుంది అని చెప్పాలి.

Leave a Comment