న్యూస్

రికార్డ్ వ్యూస్ తో వకీల్ సాబ్ వీర విహారం…ఊరమాస్ ఇదీ!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సెకెండ్ వేవ్ పరిస్థితుల ఎఫెక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును త్వరగానే ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటికే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. ఇక సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకే…

డిజిటల్ రిలీజ్ ను కూడా రీసెంట్ గా సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి అక్కడ నుండి కూడా అద్బుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా కి డిజిటల్ లో వ్యూస్ కూడా…

అద్బుతంగా వస్తున్నాయని తెలుస్తుంది. ఆల్ ఇండియా నుండి వ్యూవర్స్ సబ్ టైటిల్స్ తో సినిమాను చూస్తున్నారు. కాగా అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా సినిమా వీకెండ్ వ్యూస్ ని రివీల్ చేయలేదు కానీ టాలీవుడ్ మూవీస్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో… ఎక్కువ వ్యూవర్ షిప్ ను…

వకీల్ సాబ్ సినిమా సొంతం చేసుకుందని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలలో… సినిమా రివ్యూలు టాక్ అద్బుతంగా ఉండటం, దానికి తోడూ రీమేక్ అవ్వడం తో ఒరిజినల్ తో కంపేర్ చేయడానికి ఒరిజినల్స్ ని చూసిన వాళ్ళు కూడా వకీల్ సాబ్ ను చూస్తూ ఉండటం తో భారీ గా వ్యూస్ ఈ సినిమా కి దక్కుతున్నాయని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం చెల్లించి సినిమా…

డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా మొత్తం రికవరీ అవ్వడానికి పెద్ద టైం ఏమి పట్టదని ధీమా గా ఉన్నారట. ఇక సినిమా మొత్తం మీద సాధించిన వ్యూస్ లెక్క మొదటి వారానికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అవి తెలిసిన తర్వాత ఎన్ని వ్యూస్ ని సినిమా సాధించింది అనేది అప్ డేట్ చేస్తాం…

Leave a Comment