గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

రీసెంట్ సూపర్ హిట్…దిల్ రాజు బాలీవుడ్ లో రీమేక్!!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు యమ స్పీడ్ తో అన్ని సినిమాల పనుల్లో ఇన్వాల్వ్ అయ్యే టైప్. ఒక పక్క తన బ్యానర్ లో వచ్చే సినిమా ల పనులతో పాటు మరో పక్క ఇతర క్రేజీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటూ బిజీ గా ఉండే దిల్ రాజు అప్పుడప్పుడు రీమేక్ సినిమా లను కూడా తెలుగు ఆడియన్స్ కి నచ్చుతాయని రీమేక్ చేస్తూ ఉంటాడు..

కానీ ఇప్పుడు రూట్ మార్చి ఇక్కడ రీమేక్ సినిమాలు తీయడమే కాకుండా ఇండస్ట్రీ మారి వేరే ఇండస్ట్రీ లో కూడా సినిమా లను రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా ను ఇప్పుడు దిల్ రాజు బాలీవుడ్ లో…

రీమేక్ చేసే ప్లాన్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడని సమాచారం. బాలీవుడ్ లో మాస్ అండ్ క్లాస్ సెక్షన్స్ కి తగ్గట్లు డిఫెరెంట్ మూవీస్ తీస్తారు, అర్బన్ క్లాస్ కి నచ్చే సినిమాలు కూడా సెపరేట్ గా ఉంటాయి, అలాంటి కోవలోకే వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో హిట్ మూవీ కూడా ఒకటి.

Hit Movie Total World Wide Collections!

సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు డిఫెరెంట్ కాన్సెప్ట్ ని కూడా టచ్ చేసిన ఈ సినిమా తెలుగు లో భారీ పోటి లో అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యి కూడా సూపర్ హిట్ గా నిలవగా ఈ సినిమా ను నిర్మించిన నాని దగ్గర నుండి 1.2 కోట్ల రేటు చెల్లించి దిల్ రాజు రీ మేక్ రైట్స్ తీసుకున్నాడని టాక్.

హిందీ లో తనకున్న కాంటాక్ట్స్ ని వాడుకుని ఈ సినిమా ను అక్కడ ఆడియన్స్ కి నచ్చే విధంగా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్ రాజు ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులను బట్టి ఈ సినిమా ఈ ఇయర్ లో కానీ వచ్చే ఇయర్ లో కానీ మొదలు పెట్టె చాన్స్ ఉందట.

Leave a Comment