న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

రూలర్ TRP రేటింగ్: అమ్మింది 5 కోట్లకి…వచ్చిన TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్. బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 ఇయర్ ఎండ్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని నిరాశ పరిచి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా పరుగును ముగించింది. దాంతో 2019 ఇయర్ లో హాట్రిక్ డిసాస్టర్స్ తో బాలయ్య ఆ ఇయర్ ని చాలా బ్యాడ్ గా ముగించాడు. కాగా ఈ ఫైనల్ రన్ లో 24.5 కోట్ల టార్గెట్ కి మొత్తం మీద

10 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె వసూల్ చేసి డబుల్ డిసాస్టర్ గా పరుగును ముగించింది. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను జెమినీ టీవీ వారు ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను దక్కించుకున్నారు. పెర్ఫెక్ట్ రేటు ఎంత అనేది క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ…

ఓన్లీ టెలివిజన్ శాటిలైట్ రైట్స్ మాత్రం 5 కోట్ల రేంజ్ లో అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. కాగా సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు వచ్చిన TRP రేటింగ్ కూడా సినిమా రిజల్ట్ నే ఆల్ మోస్ట్ తలపించేలా ఉందని చెప్పొచ్చు.

సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు మొత్తం మీద 7.5 TRP రేటింగ్ దక్కినట్లు సమాచారం… ఇది మరీ తీసి పారేసే TRP రేటింగ్ కాక పోయినా కానీ సినిమా ని కొన్న రేటు దృశ్యా చూస్తె మాత్రం నిరాశ పరిచే TRP రేటింగ్ అనే చెప్పాలి. ఇక బాలయ్య తన అప్ కమింగ్ మూవీ ని…

తనకి సింహా, లెజెండ్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చి ఇప్పుడు వినయ విదేయ రామ తో డీలా పడ్డ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వాలని బాలయ్య ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పొచ్చు.

Leave a Comment