న్యూస్

రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఊరమాస్…రికార్డ్ లెవల్ ట్రెండ్!

లాక్ డౌన్ అయిపోయినా కానీ ఎక్కువ శాతం జనాలు బయటికి వెళ్ళకుండా ఇళ్ళల్లోనే ఉంటూ టైం పాస్ చేస్తున్నారు, ఇక సోషల్ మీడియా లో ఎప్పుడూ ఎదో ఒక ట్రెండ్ జరుగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగస్టు 1 నుండి ఆగస్టు 2 సాయంత్రం 6 వరకు సోషల్ మీడియా లో ట్రెండ్ చేశారు. ఈ ట్రెండ్ లో రికార్డ్ లెవల్ లో ట్వీట్స్ తో దుమ్ము దుమారం చేశారు.

సోషల్ మీడియా లో అన్ని ట్రెండ్స్ తో పాటు ఎలాంటి అకేషన్ లేకున్నా జస్ట్ హీరో పేరు మీద కూడా అప్పుడప్పుడు ఎదో ఒక ట్రెండ్ చేస్తూ ఉంటారు. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఫ్యాన్స్ కూడా 24 గంటల పాటు ట్రెండ్ చేశారు.

#RiseOfPanIndiaStarPrabhas అంటూ భారీ ట్రెండ్ ని చేశారు… బాహుబలి సినిమా కి ముందు లోకల్ స్టార్ మాత్రమే అయిన ప్రభాస్ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ అనే న్యూ టాగ్ కేవలం బాహుబలి కే ఆగిపోలేదని…

సాహో సినిమా అక్కడ సాధించిన విజయం నిరూపించింది, అట్టర్ డిసాస్టర్ టాక్ తో కూడా సినిమా అక్కడ సూపర్ హిట్ అనిపించుకుంది. లోకల్ లో కన్నా కూడా అక్కడ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇక ప్రభాస్ చేస్తున్న అప్ కమింగ్ మూవీస్ కి కూడా అక్కడ సెన్సేషనల్ క్రేజ్ ఏర్పడగా…

ప్రభాస్ 21 వ సినిమాలో బాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తుండటం విశేషం… ఇలాంటి అచీవ్ మెంట్ ని సొంతం చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా లో ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ 24 గంటల్లో 2.8 మిలియన్ ట్వీట్స్ తో ఏ అకేషన్ లేకున్నా కానీ సాలిడ్ ట్రెండ్ తో 24 గంటల పాటు సోషల్ మీడియా లో దుమ్ము దుమారం చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేశారు…

Leave a Comment