గాసిప్స్ న్యూస్

రేపు రిలీజ్ కానీ రిలీజ్ ఆగిపోయింది…రీజన్ ఇదే!!

Rx100 ఫేం కార్తికేయ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 90ML…. రీసెంట్ టైం తన సినిమాల్లో కొంచం మంచి బజ్ ని సొంతం చేసుకున్న సినిమా ఇదే, పాటలు కానీ టీసర్ అండ్ ట్రైలర్ కానీ ఉన్నంతలో మంచి బజ్ నే సినిమా కి దక్కేలా చేశాయి. దాంతో సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న తరుణం లో సినిమా యూనిట్ కి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా ని 5 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.

కానీ చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ ఉండటం తో సెన్సార్ ఆలస్యం అవ్వగా సినిమా సెన్సార్ ఆలస్యం అయింది. కాగా ఈ రోజు సెన్సార్ కి వెళ్ళినా వాళ్ళు సినిమా లో కొన్ని సీన్స్ ని కట్ చేయమని చెప్పారని టాక్. యూనిట్ ఆ సీన్స్ ని కట్ చేసి…

మళ్ళీ సెన్సార్ కి సబ్మిట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారట. ఇప్పటికీ సబ్ మిట్ చేయక పోవడం తో అనుకోకుండా ఎదురు అయిన ఈ అవరోధం తో సినిమా రిలీజ్ ఇప్పుడు ఆగిపోయింది. 5 న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే… 6 న శుక్రవారం రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

యూజువల్ గా అన్ని సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయి కానీ గురువారం రిలీజ్ చేస్తే ఒకరోజు ఎక్కువ వీకెండ్ దొరికే అవకాశం ఉండటం తో 5 న మూవీ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినా ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లంస్ వలన సినిమా రిలీజ్ ఒక రోజు పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది.

RX100 తర్వాత కార్తికేయ నటించిన హిప్పీ భారీ డిసాస్టర్ అవ్వగా తర్వాత చేసిన గుణ 369 సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా ఓవర్ బిజినెస్ వలన దెబ్బ తిని ఫ్లాఫ్ అయింది. ఇక లేటెస్ట్ మూవీ 90ML బిజినెస్ వివరాలు థియేటర్ రిలీజ్ వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా తో అయినా కార్తికేయ కంబ్యాక్ చేస్తాడో లేదో చూడాలి.

Leave a Comment