న్యూస్ బాక్స్ ఆఫీస్

లక్ష్మీ ఫస్ట్ డే ఓవర్సీస్ కలెక్షన్స్…ఇది దారుణం అబ్బ!!

కరోనా వలన టోటల్ పరిస్థితులు మారిపోయిన విషయం తెలిసిందే, కొన్ని దేశాల్లో పరిస్థితులు బాగున్నాయి అంటూ థియేటర్స్ ని రీ ఓపెన్ చేయగా ఇప్పుడు సెకెండ్ వేవ్ అక్కడ మళ్ళీ పరిస్థితులు మొదటికి చేరేలా చేస్తున్నాయి. ఇలాంటి టైం లో ఇండియా లో థియేటర్స్ రీ ఓపెన్ చేసినా కానీ సినిమాలను రిలీజ్ చేయడం కోసం స్టార్స్ అందరూ మరింత టైం తీసుకోవడం తో… అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ…

లక్ష్మీ ని ఇండియా లో థియేటర్స్ రీ ఓపెన్ అయినా కానీ డైరెక్ట్ రిలీజ్ చేయగా ఓవర్సీస్ లో మాత్రం కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్ లో రిలీజ్ చేశారు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లలో సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయగా అక్కడ కూడా 50% ఆక్యుపెన్సీ తోనే సినిమా థియేటర్స్ ని….

రీ ఓపెన్ చేయగా ఈ సినిమా ఆస్ట్రేలియా లో 43 స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా న్యూజిలాండ్ లో 29 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది, కాగా మొదటి రోజు ఆస్ట్రేలియా లో 15,886 డాలర్స్ ని కలెక్ట్ చేయగా ఇండియన్ కరెన్సీ లో 11.78 లక్షల రెవెన్యూ వస్తుంది, ఇక న్యూజిలాండ్ లో….

14,897 డాలర్స్ ని కలెక్ట్ చేయగా ఇండియన్ కరెన్సీ లో 11.05 లక్షల రెవెన్యూ వస్తుంది…మొత్తం మీద రెండు చోట్లా కలిపి 30,783 డాలర్స్ ని 22 లక్షల 83 వేల గ్రాస్ కలెక్షన్స్ ని వసూల్ చేసిన ఈ సినిమా దారుణమైన స్టార్ట్ ని సొంతం చేసుకుంది ఓవర్సీస్ లో… మిగిలిన చోట్ల లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా మొత్తం మీద బయట పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయి అన్నది…

క్రిస్టల్ క్లియర్ గా అర్ధం అవుతుంది అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ అంతా నార్మల్ స్టేజ్ కి రావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా సినిమా ఓవర్సీస్ బిజినెస్ లెక్కలు రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి. మొత్తం మీద ఈ పరిస్థితులు చూస్తుంటే ఇండియన్ సినిమాలు రెగ్యులర్ రిలీజ్ లకు మరింత టైం పట్టేలా ఉందని చెప్పాలి.

Leave a Comment