న్యూస్ బాక్స్ ఆఫీస్

లక్ష్మీ ఫస్ట్ వీక్ ఓవర్సీస్ కలెక్షన్స్…..దెబ్బ పడింది!!!

అక్షయ్ కుమార్ లారెన్స్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ ఈ ఇయర్ బాక్స్ అఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి అయినా కానీ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా రాగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది, అయినా కానీ వ్యూస్ పరంగా సినిమా….

అల్టిమేట్ రికార్డులను నమోదు చేసిందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. ఇక సినిమా ఇక్కడ డైరెక్ట్ రిలీజ్ అయినా కానీ ఓవర్సీస్ లో సెలెక్టివ్ ప్లేసెస్ లో మాత్రం థియేట్రికల్ రిలీజ్ ను లిమిటెడ్ గా సొంతం చేసుకుంది,

అక్కడ సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు మొదటి వారానికి గాను బయటికి వచ్చాయి, ఒకసారి ఆ లెక్కలను గమనిస్తే… సినిమా ముందుగా ఆస్ట్రేలియాలో మొదటి వీకెండ్ 3 రోజుల్లో 1 లక్షా 30 వేల లోపు ఆస్ట్రేలియన్ డాలర్స్ ను వసూల్ చేయగా ఇండియన్ లెక్కల్లో 70.50 లక్షల గ్రాస్ ను 21 లోకేషన్స్ లో వసూల్ చేసింది.

ఇక న్యూజిలాండ్ లో 21 లోకేషన్స్ లో NZ$ 82,751 డాలర్స్ ని వసూల్ చేయగా ఇండియన్ కరెన్సీ లో 42.38 లక్షల గ్రాస్ ని వసూల్ చేసింది. ఇక ఫిజీ దేశంలో 7 లోకేషన్స్ లో FJ$ 48,538 డాలర్స్ ని వసూల్ చేయగా ఇండియన్ కరెన్సీ లో 17.16 లక్షల గ్రాస్ ని సాధించింది. ఇక పాపువా న్యూ గునియా లో 18 వేలను….

UAE లో మొదటి వారానికి గాను 1.46 కోట్ల దాకా గ్రాస్ ను వసూల్ చేసింది ఈ సినిమా… టోటల్ గా ఓవర్సీస్ లో సినిమా 2.76 కోట్ల దాకా ఓవరాల్ గ్రాస్ ని వసూల్ చేసింది, ఓవర్సీస్ లో కరోనా ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుంది, కొత్త సినిమాకే ఇలాంటి పరిస్థితి అంటే అన్ని చోట్లా పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి మరింత టైం పట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment