గాసిప్స్ న్యూస్

లవ్ స్టొరీ కి మమ్మోత్ OTT రేటు….మరీ ఈ రేంజ్ రేటు ఏంటి సామి!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ లవ్ స్టొరీ, లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఫస్ట్ వేవ్ వలన పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా మళ్ళీ సెకెండ్ వేవ్ వలన నిరవధికంగా పోస్ట్ పోన్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

దాంతో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేకుండా పోయింది… ఇక సినిమా కి క్రేజ్ సాలిడ్ గా ఉన్న నేపధ్యంలో సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయించడానికి వరుసగా టాప్ OTT యాప్స్ అన్నీ కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తుంది.

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మళ్ళీ కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ వైపు మొగ్గు చూపుతూ ఉండటం తో లవ్ స్టొరీ ని డిజిటల్ రిలీజ్ చేయించాలని ట్రై చేస్తున్నాయి. ఇందులో భాగంగా సినిమా కి మమ్మోత్ OTT డిజిటల్ రేటు ఆఫర్ చేస్తున్నాయని తెలుస్తుంది. తెలుగు లో ఇప్పటి వరకు డిజిటల్ రిలీజ్ అయిన మూవీస్…

అన్నింటిలోకి హైయెస్ట్ అనిపించే విధంగా 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి OTT జైంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఇది నిజంగానే బిగ్గెస్ట్ రేట్లు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ రేంజ్ కూడా 35 కోట్ల రేంజ్ లో…జరిగేదని సెకెండ్ వేవ్ కన్నా ముందు కొన్ని ఏరియాల బిజినెస్ లెక్కలను చూస్తే అర్ధం అవుతుంది.

ఇక డిజిటల్ రిలీజ్ తర్వాత ఉంటుంది కాబట్టి 6-8 కోట్ల రేటు దక్కోచ్చు… కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఓపెన్ ఆఫర్ కింద 50 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్న నేపధ్యంలో ఇది అద్బుతమైన డీల్ అనే చెప్పొచ్చు. కానీ టీం మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారని తెలుస్తుంది…

Leave a Comment