టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

లవ్ స్టొరీ టోటల్ కలెక్షన్స్….పెట్టింది ఎంత…వచ్చింది ఎంత!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేకున్నా బరిలోకి దిగి ఆంధ్ర లో ఎదురుదెబ్బలు తిన్నా కానీ టాలీవుడ్ తరుపున ఈ సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడమే కాదు లాంగ్ రన్ లో కూడా టాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాగా నిలిచింది…

సినిమా నార్మల్ టైం లో రిలీజ్ ను కనుక సొంతం చేసుకుని ఉంటే కచ్చితంగా మీడియం రేంజ్ హీరోలలో టాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసే అంత రేంజ్ ఈ సినిమా కి ఉండేది కానీ పరిస్థితుల వలన సినిమా ఓవరాల్ గా బాగానే పెర్ఫార్మ్ చేసింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ టైం లో కూడా రికార్డ్ ను నమోదు చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 12.62Cr
👉Ceeded: 4.50Cr
👉UA: 3.15Cr
👉East: 1.74Cr
👉West: 1.48Cr
👉Guntur: 1.59Cr
👉Krishna: 1.50Cr
👉Nellore: 94L
AP-TG Total:- 27.52CR(44.90CR~ Gross)
Ka+ROI: 2.46Cr
OS – 5.10Cr~(Updated)
Total WW: 35.08CR(62.60CR~ Gross)
సినిమా కోస్టల్ ఆంద్ర రీజన్ లో మాత్రం ఓవరాల్ బిజినెస్ ను అందుకోలేక నష్టాలను సొంతం చేసుకుంది…

కానీ టోటల్ గా 32 కోట్ల టార్గెట్ మీద 3.08 కోట్ల ప్రాఫిట్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది, ఆంధ్రలో 100% ఆక్యుపెన్సీ రిపోర్ట్ చేసి ఉంటే మినిమమ్ 40-42 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సినిమా ఓవరాల్ గా అందుకుని ఉండేది. కానీ అలా జరగక పోవడంతో ఉన్నంతలో సూపర్ హిట్ గా పరుగును ముగించింది ఈ సినిమా..

Leave a Comment