న్యూస్ రివ్యూ

లవ్ స్టొరీ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ మీద భీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. సమ్మర్ కి రావాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది, భారీ హైప్ నడుమ ఆల్ మోస్ట్ 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న లవ్ స్టొరీ అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…నిజామాబాద్ లో ఒక ఊరిలో ఉండే వేరు వేరు కాస్ట్ ల హీరో హీరోయిన్స్… తమ గోల్స్ ని అచీవ్ చేయడానికి హైదరాబాద్ వస్తారు, ఇద్దరూ కూడా తమ తమ లైఫ్ లో స్ట్రగుల్ అవుతారు, తర్వాత హీరోయిన్ డాన్స్ చూసిన హీరో తన గ్రూప్ లో చేరమంటాడు…

తర్వాత ఇద్దరూ కలిసి హీరో జుంబా డాన్స్ అకాడమీలో పని చేయడం లవ్ లో పడటం జరుగుతుంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో గొడవలు స్టార్ట్ అవుతాయి… మరి తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ… కథగా చూసుకుంటే చాలా సింపుల్ స్టొరీ లైన్ తో తెరకేక్కినా…

కథలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని కీలక అంశాలను సినిమాలో జోడించి చెప్పిన కమ్ముల ఎక్కడా కూడా ఓవర్ ది టాప్ కి వెళ్ళకుండా క్లియర్ గా అనుకున్నది చెప్పాడు… నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని సినిమాను భుజాన మోసాడు… సాయి పల్లవి ఎప్పటి లానే తన రోల్ కి 100% న్యాయం చేసింది…

ఇక ఈశ్వరి రావ్, ఉత్తేజ్, రాజీవ్ కనకాల లాంటి వాళ్ళు మంచి ఇంపాక్ట్ నే క్రియేట్ చేశారు… సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్… పాటలు ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంతే బాగున్నాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్లో నరేషన్ తో సాగుతుంది, అది శేఖర్ కమ్ముల సినిమాల్లో కామన్…

డైలాగ్స్ బాగున్నాయి… సినిమాటోగ్రఫీ, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ చేసి చాలా కాలం అయింది, కానీ తన మార్క్ సీన్స్ తో మ్యాజిక్ చేశాడు, వాటితో పాటు లీడర్ లో చెప్పిన 60 ఏళ్ల స్వాతంత్ర్య ప్రయాణంలో ఇంకా అంటరాని తనమా అంటూ చెప్పిన సీన్ ని ఇక్కడ కథలో బాగా సెట్ అయ్యేలా రాసుకున్నాడు…

కానీ కథని కొంచం ఎక్కువ సాగదీసినట్లు అనిపించింది. ముఖ్యంగా 2 గంటల 38 నిమిషాల లెంత్ లో 2 గంటల పాటు కథ స్లోగా నడవగా చివరి 38 నిమిషాల కథ అప్పటి వరకు ఉన్న ఫ్లోని మరో యాంగిల్ కి మార్చుతూ కాంప్లెక్స్ నరేషన్ తో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కి వెళుతుంది, ఈ పోర్షన్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా లాంగ్ రన్ ఆధారపడి ఉంటుంది…

నాగచైతన్య సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, శేఖర్ కమ్ముల డైలాగ్స్, సాంగ్స్ పిక్చరైజేషన్ లాంటివి మెయిన్ హైలెట్ కాగా కథ స్లోగా ఉండటం, కాంప్లెక్స్ డార్క్ సీన్స్ రెగ్యులర్ ఆడియన్స్ కి ఎక్కుతుందా లేదా అనే అనుమానాలు ఉండటం డ్రా బ్యాక్స్ అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా పై ఉన్న అంచనాలతో ఫిదా రేంజ్ లవ్ స్టొరీ ని ఎక్స్ పెర్ట్ చేస్తే కొంచం అంచనాలు అందుకోలేదు సినిమా… కానీ ఇది రెగ్యులర్ లవ్ స్టొరీ కాదు.. శేఖర్ కమ్ముల లవ్ స్టొరీలో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ని టచ్ చేస్తూ హార్ట్ టచింగ్ గా తీసిన సినిమా….

శేఖర్ కమ్ముల మూవీస్ ఇష్టపడే వాళ్ళకి లవ్ స్టొరీ కచ్చితంగా మరో మంచి సినిమాగా అనిపిస్తుంది, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఎబో యావరేజ్ లా ఉంటుంది… ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ కి లాస్ట్ 35 నిమిషాలకు కనెక్ట్ అయితే సినిమా బాగా నచ్చుతుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్….

Leave a Comment