న్యూస్

లవ్ స్టొరీ సెన్సార్ ఫస్ట్ టాక్ ఇదే…టాక్ ఎలా ఉందంటే!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకోగా U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ రన్ టైం 2 గంటల 38 నిమిషాల లెంత్ తో తెరకెక్కింది అని తెలుస్తుంది.

ఇక సినిమా కి సెన్సార్ వారి నుండి మొదటి టాక్ కూడా ఇప్పుడు బయటికి వచ్చేసింది, ఆ టాక్ ప్రకారం చూసుకుంటే సినిమా శేఖర్ కమ్ముల ఇతర మూవీస్ రేంజ్ లో ఏమాత్రం ఫ్లో తగ్గకుండా హార్ట్ కి టచ్ చేసే స్టొరీ తో తెరకెక్కింది అంటున్నారు. వేరు వేరు కులాల హీరో హీరోయిన్స్…

ఇద్దరూ లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ ఉన్న టైం లో కలవడం హీరోయిన్ డాన్స్ నచ్చి తన గ్రూప్ లో చేరమని హీరో చెప్పడం తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ, ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు నో చెప్పడం తర్వాత వీళ్ళు లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లంస్ ని…

ఎలా సాల్వ్ చేసుకున్నారు అన్న స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన లవ్ స్టొరీ ఫస్టాఫ్ వరకు క్యారెక్టర్ ల ఇంట్రోలు వాటి మధ్య ఎమోషన్స్ ని బాగా చూపెట్టిన డైరెక్టర్ తర్వాత హీరో హీరోయిన్స్ లైఫ్ లో ఎమోషన్స్ ని చూపెడుతూ మంచి పాయింట్ మీద ఇంటర్వెల్ ను తర్వాత సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ డోస్ పెంచినా ఎక్కడా కథని డీవియేట్ చేయకుండా…

డీల్ చేసి క్లైమాక్స్ కి చిన్న మెసేజ్ తో ఎండ్ చేశాడు అని మెచ్చుకుంటున్నారు. లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించినా టైం పెద్దగా తెలియకుండానే సినిమా పూర్తీ అవుతుందని అంటున్నారు. ఓవరాల్ గా సెన్సార్ నుండి సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఆడియన్స్ ముందుకు వచ్చాక ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంటే సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

Leave a Comment