న్యూస్ బాక్స్ ఆఫీస్

లవ్ స్టొరీ 18th డే, కొండ పొలం-ఆరడుగుల బుల్లెట్ 4th డే, డాక్టర్ 3rd డే కలెక్షన్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన లవ్ స్టొరీ సినిమా 17 వ రోజు తో పోల్చితే 18 వ రోజు ఆల్ మోస్ట్ 50% డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది, కానీ కొన్ని చోట్లా మాత్రం మంచి ఆక్యుపెన్సీని దక్కించుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు 18 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 20-25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఇక లాస్ట్ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొండ పొలం సినిమా వీకెండ్ ని యావరేజ్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా 4 వ రోజు ఆల్ మోస్ట్ 55-60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ రోజు సినిమా…

తెలుగు రాష్ట్రాలలో 30-35 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక గోపీచంద్ ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ వర్కింగ్ డేస్ లో గట్టి డ్రాప్స్ నే సొంతం చేసుకుంది… ఆల్ మోస్ట్ 55% వరకు డ్రాప్స్ ఉండగా…

సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 10-12 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక రిలీజ్ అవ్వడం చాలా సైలెంట్ గా రిలీజ్ అయినా రెండో రోజు నుండే థియేటర్స్ ని పెంచుకున్న డబ్బింగ్ మూవీ వరుణ్ డాక్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజున రెండో రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…

దాంతో సినిమా ఇప్పుడు మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 20 లక్షలకు అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇది సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కి సమానం అని చెప్పాలి. ఇక ఈ నాలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని ఓవరాల్ గా వర్కింగ్ డే లో సొంతం చేసుకుంటాయో చూడాలి.

Leave a Comment