న్యూస్ బాక్స్ ఆఫీస్

లవ్ స్టొరీ 19th డే, కొండ పొలం-ఆరడుగుల బుల్లెట్ 5th డే, డాక్టర్ 4th డే కలెక్షన్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ అన్ని సినిమాల మీద ఉందని చెప్పాలి, కానీ ఇప్పటికే లవ్ స్టొరీ సినిమా బ్రేక్ ఎవెన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 60 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా అందుకుని దుమ్ము లేపింది. ఇక 18 వ రోజు తో పోల్చితే 19 వ రోజు 35% వరకు డ్రాప్స్ కనిపిస్తున్న లవ్ స్టొరీ ఈ రోజు తెలుగు రాష్ట్రలలో 12-15 లక్షల షేర్ ని అందుకోవచ్చు.

ఇక లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే కొండ పొలం సినిమా వీకెండ్ కే కష్టపడగా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 4 వ రోజు తో పోల్చితే ఇప్పుడు 5వ రోజు 30% కి పైనే డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో….

ఈ రోజు సినిమా 18 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునేలా ఉంది…. ఇక ఆరడుగుల బుల్లెట్ సినిమా ఆల్ రెడీ రేసు నుండి తప్పుకోగా డ్రాప్స్ కొంచం తక్కువగానే ఉండటం కొంచం కలిసి వచ్చే అంశమే… 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు 15% డ్రాప్ అయిన ఈ సినిమా…

ఈ రోజు 8-10 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉందని చెప్పాలి. ఇక డబ్బింగ్ మూవీ వరుణ్ డాక్టర్ ఉన్నంతలో బెటర్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. మూడో రోజు మంచి ట్రెండ్ చూపెట్టిన ఈ సినిమా నాలుగో రోజు ఆల్ మోస్ట్ 15% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో..

15 లక్షల నుండి 18 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలపై ఈ కలెక్షన్స్ అందుకోవడమో లేక మించడమో జరగోచ్చు. లవ్ స్టొరీ లాభాల్లోనే ఉండగా మిగిలిన సినిమాల్లో బ్రేక్ ఈవెన్ అవకాశం వరుణ్ డాక్టర్ మూవీ కి ఉందని చెప్పొచ్చు, కానీ కొత్త సినిమాల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది.

Leave a Comment