న్యూస్

లవ్ స్టొరీ OTT రిలీజ్ డేట్ ఇదే!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు అనుకున్న టైం కి రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే సత్తా ఉన్న సినిమా అయ్యేది కానీ పరిస్థితుల వలన సినిమా రిలీజ్ అనుకూలంగా లేని టైం లో కూడా బరిలోకి దిగి…

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడమే కాదు ఇప్పుడు లాభాల బాటలో కూడా దూసుకు పోతూ ఉండగా సినిమా థియేట్రికల్ రన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ సినిమా డిజిటల్ రిలీజ్ కి డేట్ కన్ఫాం అయ్యిందని సమాచారం.

సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఆహా వీడియో వాళ్ళు సినిమా రిలీజ్ అయిన 5 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకోగా ఈ నెల 22 న సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ లోపు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎంత కుదిరితే అంత కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని తర్వాత డిజిటల్ లో దుమ్ము లేపడానికి సిద్దం కానుంది.

Leave a Comment