న్యూస్ బాక్స్ ఆఫీస్

లవ్ స్టొరీ@60…..మాస్ భీభత్సం ఇది!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ ను స్లో అండ్ స్టడీగా గెలిచి లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుని ఆడియన్స్ ని వర్కింగ్ డేస్ లో కొంచం తగ్గినా థియేటర్స్ కి స్టడీగా రప్పిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో మైలురాయి ని అధిగమించి సంచలనం సృష్టించడం విశేషం…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 18 రోజుల్లో ఓవరాల్ గా 33.5 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 19వ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది… టాలీవుడ్ తరుపు నుండి సెకెండ్ వేవ్ తర్వాత అలాగే ఇండియా తరుపున కూడా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మార్క్ ని టచ్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఇక మిగిలిన లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Leave a Comment