న్యూస్

లార్గో వించ్ గుర్తుందా…మొన్నటి దాకా ఫ్రీమేక్…ఇప్పుడు అఫీషియల్ రీమేక్….కంప్లీట్ డీటైల్స్ ఇవే!

మూడేళ్ళ క్రితం వచ్చిన అజ్ఞాతవాసి కానీ రెండేళ్ళ క్రితం వచ్చిన సాహో సినిమా కానీ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాల పేర్లతో ఈక్వల్ గా వినిపించిన మరో పేరు ఒకటి ఉంది, ఆ సినిమానే లార్గో వించ్… ఈ హాలీవుడ్ మూవీ ని మన వాళ్ళు తల్చుకున్నట్లు ఎవరూ తలచుకోలేదు అనే చెప్పాలి. ఆ సినిమాను ప్రేరణ గా తీసుకుని మన దగ్గర వరుస పెట్టి సినిమాలు అదే కాన్సెప్ట్ తో…

సినిమాలను రూపొందించారు. అజ్ఞాత వాసి సినిమా అయితే సీన్ టు సీన్ ఆ సినిమా నుండే తీసుకుని తెలుగు కి సరిపడా మార్పులు చేర్పులు చేశారు. దాంతో ఆ సినిమా రిలీజ్ టైం లో డైరెక్టర్ నా సినిమా కాపీ కొట్టారు అంటూ కేసు వేశాడు. అజ్ఞాతవాసి రిలీజ్ అయ్యాక…

సినిమా కంప్లీట్ కాపీ అని తెలిసి తెగ ట్రోల్ కి గురి అయింది, తర్వాత సాహో రిలీజ్ టైం కి వచ్చే సరికి మళ్ళీ అదే కథని కొన్ని మార్పులతో తెరకెక్కించారు. మళ్ళీ ఆ సినిమా వార్తల్లో రావడం భారీగా ట్రోల్ అవ్వడం ఆ సినిమా డైరెక్టర్ మళ్ళీ కాపీ గొడవ చేయడం జరిగింది.

కట్ చేస్తే ఇప్పుడు అదే సినిమాను అఫీషియల్ గా హిందీ లో రీమేక్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. హిందీలో సినిమా రీమేక్ రైట్స్ ని ఎప్పుడో తీసుకున్నారు కానీ కాస్ట్ అండ్ క్రూ సెట్ అవ్వక పోవడం తో ఇన్నాళ్ళు ఆగారు, కానీ ఇప్పుడు సినిమా అఫీషియల్ రీమేక్ ని కన్ఫాం చేస్తూ హిందీ లో విద్యుత్ జామ్వాల్ హీరోగా…

రీమేక్ ని కన్ఫాం చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిందీ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆల్ రెడీ తెలిసిన కథని ఎలాంటి మార్పులతో తెరకెక్కిస్తారో చూడాలి, తెలుగు లో అయితే ఫలితం తేడా కొట్టింది, మరి హిందీ లో అఫీషియల్ రీమేక్ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.

Leave a Comment