న్యూస్

లాస్ట్ వీక్ కుమ్మేసిన టాలీవుడ్ మూవీస్…టాప్ రేటింగ్స్ సాధించిన సినిమాలు ఇవే!

కరోనా ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ టైం లో జనాలు మొత్తం టెలివిజన్ కే పరిమితం అవ్వగా అన్ని సినిమాలకు కూడా సాలిడ్ గా TRP రేటింగ్ లు రావడం మనం చూస్తూనే ఉన్నాం… కాగా లాక్ డౌన్ తర్వాత రీసెంట్ టైం లో సినిమాలు పెద్దగా జోరు చూపలేక పోయాయి. ఏవో కొన్ని క్రేజ్ ఉన్న సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలు అన్నీ కూడా తక్కువ TRP రేటింగ్ తోనే సరిపెట్టుకున్నాయి.

కానీ లాస్ట్ వీక్ మాత్రం సాలిడ్ గా అన్ని సినిమాలు కుమ్మేశాయి అని చెప్పాలి. కొత్త పాత అని తేడా లేకుండా అన్ని సినిమాలకు కూడా సాలిడ్ గా TRP రేటింగ్ లు దక్కగా టాప్ ప్లేస్ లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా…

సెన్సేషనల్ TRP రేటింగ్ తో దుమ్ము లేపగా తర్వాత 21 ఏళ్ల క్రితం మూవీస్ అయిన నరసింహా మరియు రాజా సినిమాలు నిలిచాయి. ఇక ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన నవ మన్మథుడు పర్వాలేదు అనిపించగా… ఈ ఏడాది ఫస్ట్ డబ్ హిట్ అయిన కనులు కనులను దోచాయంటే మంచి రేటింగ్ తో కుమ్మేసింది.

మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ ప్లేసులలో నిలిచిన సినిమాలను గమనిస్తే…
#SarileruNeekevvaru- 17.4
#Narasimha- 7.68
#Raja- 7.41
#Whistle- 7.18
#KanuluKanulanuDochayante-7.1
#Shakthi(dub)- 4
#Temper- 3.4
#Raaja- 3.3
#NavaManmathudu- 3.2~
#Jumanji2- 3.03
#Nayak- 3
#GundeJaariGallanthayyinde- 2.8
ఇలా అన్ని సినిమాలకు కూడా లాస్ట్ వీక్ సాలిడ్ TRP రేటింగ్ లు దక్కి టాప్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి హాలీవుడ్ డబ్ మూవీ జుమాంజి నెక్స్ట్ లెవల్ కూడా…

డీసెంట్ TRP రేటింగ్ ని అందుకుంది. మొత్తం మీద రీసెంట్ వీక్స్ లో లాస్ట్ వీక్ మూవీస్ సాలిడ్ TRP రేటింగ్ లను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ వారం కూడా బాగానే సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి. మరి వాటి లో టాప్ ప్లేసులలో TRP రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలు ఏవో వచ్చే గురువారం తేలనుంది…

Leave a Comment