న్యూస్

లాస్ట్ వీక్ కూడా కుమ్మేసిన సినిమాలు…టాప్ TRP సాధించిన సినిమాలు ఇవే!!

IPL మొదలు అయ్యే టైం కి టెలివిజన్ లో సినిమాల టెలికాస్ట్ పీక్స్ కి వెళ్ళింది, అన్ని ఛానెల్స్ లో కూడా కొత్త పాత అని తేడా లేకుండా సినిమాలను టెలికాస్ట్ చేయగా లాస్ట్ వీక్ కూడా సినిమాలు భారీ ఎత్తునే టెలికాస్ట్ అవ్వగా TRP రేటింగ్స్ ని కూడా గట్టిగానే సాధించాయి అన్ని సినిమాలు. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన సినిమాలు కూడా ఉండగా వాటిలో విజయ్ దేవర కొండ…

వరల్డ్ ఫేమస్ లవర్ లాస్ట్ వీక్ లో హైయెస్ట్ TRP రేటింగ్ సాధించిన సినిమాగా నిలిచి దుమ్ము లేపగా తర్వాత క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ రంగస్థలం మరో సారి ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అవ్వడం తో సాలిడ్ రేటింగ్ ని సొంతం చేసుకుంది దుమ్ము దుమారం చేసింది.

ఇక ఈ టీవీ లో చాలా టైం తర్వత టెలికాస్ట్ అయిన కొత్త సినిమా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కి డీసెంట్ రేటింగ్ దక్కినప్పటికీ ఆ సినిమా టెలికాస్ట్ అయినట్లే చాలా మందికి తెలియకపోవడం విచారకరం అని చెప్పాలి… ఇక ఎప్పుడో రిలీజ్ అయినా లేట్ టెలికాస్ట్ అయినా…

అప్పట్లో ఒకడుండేవాడు, డబ్ మూవీ నా లవ్ స్టొరీ మొదలైంది లాంటి సినిమాలు కూడా అపర్వాలేదు అనిపించగా ప్రతీ రోజూ పండగే ఈ సారి రాంగ్ టైమింగ్ వలన యావరేజ్ రేటింగ్ సాధించింది, ఇక ఓల్డ్ మూవీస్ లయన్, ఆక్సీజన్ గోవిందుడు అందరి వాడేలే సినిమాలు కూడా లాస్ట్ వీక్ మూవీస్ లో చోటు దక్కించుకున్నాయి. మొత్తం మీద ఒకసారి లిస్టు ను గమనిస్తే…

#WorldFamousLover- 5.82
#Rangasthalam- 5.4
#Umamaheswaraugraroopasya- 5.11
#AppatloOkadundevadu- 2.99
#NaaLovestoryModalaindi- 2.88
#PratiRojuPandaage- 2.84
#SCN- 2.54
#GovinduduAndariVadele- 2.51
#NaaPeruSurya-2.44
#Lion-2.41
#Oxygen-2.38
ఇక IPL మొదలైన తర్వాత మరీ ఈ రేంజ్ లో కాకున్నా సినిమాలు పర్వాలేదు అనిపించే విధంగా టెలికాస్ట్ అయ్యాయి. మరి అవి IPL ని డామినేట్ చేశాయ, అలాగే బిగ్ బాస్ మూడో వారానికి IPL ఎంతవరకు అడ్డొచ్చింది లాంటివి ఈ వారం రిలీజ్ అయ్యే TRP రేటింగ్స్ లో తెలియనున్నాయి.

Leave a Comment