న్యూస్

లాస్ట్ వీక్ కూడా టాప్ లేపిన సినిమాలు…హైయెస్ట్ రేటింగ్స్ ని సాధించిన సినిమాలు ఇవే!!

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా సినిమాలు దీపావళి వీకెండ్ లో బాగానే టెలికాస్ట్ అవ్వగా కొన్ని సినిమాలకు రేటింగ్ బాగా రాగా కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయి. మొత్తం మీద ఒకసారి ఆ లిస్టును గమనించే ముందు 11 వ వారానికి గాను బిగ్ బాస్ సీజన్ 4 సాధించిన రేటింగ్ లను గమనిస్తే… శనివారం ఎపిసోడ్ కి గాను 5.1 రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి గ్రోత్ దక్కి…

7.55 రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఇక వీక్ డేస్ లో యావరేజ్ గా రేటింగ్ 4.8 దాకా రాగా అంతకుముందు వారలతో పోల్చితే ఈ సారి కొంచం గ్రోత్ ని సొంతం చేసుకుంది బిగ్ బాస్, ఇక సినిమా పరంగా నవంబర్ 12 నుండి 19 వరకు టెలికాస్ట్ అయిన సినిమాలలో…

అల వైకుంఠ పురం లో సెకెండ్ టైం టెలికాస్ట్ అనుకున్న రేంజ్ లో రేటింగ్ ను సొంతం చేసుకోలేక పోయింది. అయినా కానీ ఆ వారానికి హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, ఇక బాహుబలి 2 మరో సారి సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 2 లో నిలిచింది.

ఇక ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ధనుష్ మారి తెలుగు వర్షన్ మాస్ కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోగా ఓల్డ్ మూవీస్ రచ్చ పటాస్ లు కూడా మెప్పించాగా ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయిన నాన్నకు ప్రేమతో కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద ఒకసారి కంప్లీట్ లిస్టు ను గమనిస్తే…

👉#AlaVaikunthaPurramuloo – 7.91
👉#Baahubali2 – 5.8
👉#Mass 1st Time – 4.42
👉#NannakuPrematho – 3.96
👉#Abhimanyudu – 3.61
👉#Racha – 2.85
👉#iSmartShankar – 2.71
👉#Patas – 2.6
ఇక కన్నడ లో డబ్ అయిన బాహుబలి పార్ట్ 1 సాలిడ్ గా 6.3 రేటింగ్ ను సొంతం చేసుకోగా ఈగ సినిమా కి 2.7 రేటింగ్ దక్కింది, ఇవి మొత్తం మీద నవంబర్ 12 నుండి 19 వరకు టెలికాస్ట్ అయిన సినిమాల రేటింగ్ లు, మరి గత వారం సినిమాలు ఎలాంటి ప్రదర్శనని సొంతం చేసుకున్నాయో వచ్చే వారం రిలీజ్ అయ్యాక తెలుస్తాయి అని చెప్పాలి.

Leave a Comment