న్యూస్

లాస్ట్ వీక్ టాప్ 5 TRP రేటింగ్ మూవీస్…కుమ్మింది లిస్టు!

లాస్ట్ ఇయర్ లా ఈ ఇయర్ కరోనా వేవ్ లో మరీ వరుస పెట్టి సినిమాల టెలికాస్ట్ ఏమి జరగడం లేదు కానీ, ఉన్నంతలో వీకెండ్ టైం లో సినిమాలు బాగానే టెలికాస్ట్ అవుతున్నాయి. ఇక లాస్ట్ వీక్ లో జులై 8 నుండి 15 వరకు టెలికాస్ట్ అయిన మూవీస్ రేటింగ్ వివరాలు బయటకి వచ్చాయి. ఒకసారి ఆ లిస్టు లో టాప్ మూవీస్ ని గమనిస్తే… లిస్టు చివరి నుండి చూస్తె…

లాస్ట్ వీక్ లో లాస్ట్ ప్లేస్ లో విజయ్ నటించిన ఏజెంట్ భైరవ సినిమా 2.42 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ ప్లేస్ లో నిలవగా 8 వ ప్లేస్ లో సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా 3.06 రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది.

ఇక 7 వ ప్లేస్ విషయానికి వస్తే ఓల్డ్ మూవీ రాఘవ లారెన్స్ స్టైల్ సినిమా ఇప్పటికీ హోల్డ్ చేసి 3.19 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా 6 వ ప్లేస్ లో KGF చాప్టర్ 1 సినిమా మరో సారి దుమ్ము లేపుతూ 3.22 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఇక 5 వ ప్లేస్ లో రవితేజ బెంగాల్ టైగర్ సినిమా 3.39 రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 5 ఎంటర్ అవ్వగా 4 వ ప్లేస్ లో బాలయ్య లెజెండ్ సినిమా 3.58 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక టాప్ 3 ప్లేస్ లో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా 4.88 రేటింగ్ తో దుమ్ము దుమారం చేయగా టాప్ 2 ప్లేస్ లో డబ్బింగ్ మూవీ మిడ్ నైట్ మర్డర్స్…

సినిమా 5.52 రేటింగ్ ను సొంతం చేసుకుని ఫస్ట్ టైం అవ్వడం తో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకోగా టాప్ ప్లేస్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన నితిన్ చెక్ సినిమా 8.53 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ లో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ వారం, వకీల్ సాబ్, సరిలేరు నీకెవ్వరు మరియు ఇతర సినిమాల రేటింగ్ లు రిలీజ్ కాబోతున్నాయి.

Leave a Comment