న్యూస్

లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్!

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా వరుస పెట్టి సినిమాలు అన్ని ఛానెల్స్ లో టెలికాస్ట్ అవ్వగా వాటిలో కొన్ని సినిమాలు ఆ వీక్ కి గాను టాప్ రేటింగ్ లను సొంతం చేసుకుని లిస్టులో చోటు ని దక్కించుకున్నాయి… కొన్ని సినిమాలు అంచనాలను మించి రేటింగ్ లను సొంతం చేసుకోగా కొన్ని సినిమాలు ఆశించిన మేర రేటింగ్ లను దక్కించుకోలేక పోయాయి. ఈ సారి లిస్టులో కూడా 11 సినిమాలు ఉండగా…

చివరి ప్లేస్ లో మార్నింగ్ స్లాట్ లో టెలికాస్ట్ అయిన ప్రభాస్ సాహో 1.21 రేటింగ్ తో సరిపెట్టుకుంది. ఇక 10 వ ప్లేస్ లో నాని నేను లోకల్ సినిమా 1.24 రేటింగ్ ను దక్కించుకోగా….  9 వ ప్లేస్ లో నితిన్ అఆ సినిమా 1.63 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఇక 8 వ ప్లేస్ కి వస్తే ఇస్మార్ట్ శంకర్ సినిమా 1.76 రేటింగ్ ను సొంతం చేసుకోగా 7 వ ప్లేస్ లో నాగార్జున నటించిన ఆఫీసర్ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయ్యి 2.21 రేటింగ్ ను దక్కించుకుంది. ఇక 6 వ ప్లేస్ కి వస్తే రవితేజ భద్ర సినిమా 2.41 రేటింగ్ ను దక్కించుకుని దుమ్ము లేపింది.

ఇక 5 వ ప్లేస్ లో ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా 2.81 రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 5 లో నిలిచింది. ఇక 4వ ప్లేస్ లో ఎన్టీఆర్ జైలవకుష సినిమా మార్నింగ్ స్లాట్ లో టెలికాస్ట్ అయ్యి 2.85 రేటింగ్ ను సొంతం చేసుకోగా 3వ ప్లేస్ లో నాగార్జున ఊపిరి సినిమా 3.72 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఇక 2వ ప్లేస్ లో శ్రీ విష్ణు నటించిన గాలి సంపత్ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అవుతూ 3.88 రేటింగ్ తో యావరేజ్ అనిపించుకోగా మొదటి ప్లేస్ లో అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమా 11.31 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ టాపర్ గా నిలిచింది. ఇక ఈ వారం రేటింగ్ లు ఏ విధంగా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.

Leave a Comment