న్యూస్ స్పెషల్

లాస్ట్ 6 ఏళ్లలో ఎక్కువ సెంటర్స్ లో 50 డేస్ రికార్డ్ కొట్టిన మూవీస్ ఇవే!!

రోజులు మారుతున్న కొద్దీ ఇండస్ట్రీ కూడా మారిపోతుంది. ఒకప్పటిలా ఇన్ని రోజుల పాటు నాన్ స్టాప్ గా సినిమాలు ఆడాయి అని చెప్పుకునే రోజులు ఎప్పుడో అయిపోయాయి… ఒకప్పుడు సినిమాల విజయాల రేంజ్ ని ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు, 100 రోజులు 175 రోజులు ఆడాయి అన్న దానిపై చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎంత మంచి సినిమా అయినా మహా అయితే మూడు నుండి 4 వారల పాటే ప్రేక్షకులను థియేటర్స్ లోకి రప్పించగలుగుతుంది.

కాగా రీసెంట్ టైం లో 50 రోజులు ఆడిన సినిమాలు కూడా తక్కువే అని చెప్పాలి. ఇక అందులో ఎక్కువ సెంటర్స్ లో 50 రోజుల వేడుక ని జరుపుకున్న సినిమాలు కూడా తక్కువే. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో గత 5 ఏళ్ల లోనే గమనిస్తే… హైయెస్ట్ సెంటర్స్ లో 50 డేస్ వేడుక ని జరుపుకున్న

టాప్ 5 సినిమాలను ఒకసారి గమనిస్తే…6 వ ప్లేస్ లో బాహుబలి 1 సినిమా 129 సెంటర్స్ లో 50 డేస్ ను కంప్లీట్ చేసుకుంది… ఇక 5 వ ప్లేస్ లో రంగస్థలం సినిమా 137 సెంటర్స్ లో 50 రోజుల వేడుకని కంప్లీట్ చేసుకోగా… 4వ ప్లేస్ లో అల వైకుంఠ పురంలో సినిమా మొత్తం మీద…

172 సెంటర్స్ లో 50 రోజుల వేడుకని పూర్తీ చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక 3 వ ప్లేస్ లో శ్రీమంతుడు సినిమా 185 సెంటర్స్ లో 50 రోజులను పూర్తీ చేసుకుని మరో సంచలనం సృష్టించగా రెండో ప్లేస్ లో మళ్ళీ మహేష్ నటించిన మహర్షి సినిమా 200 సెంటర్స్ లో 50 రోజులను కంప్లీట్ చేసుకుని నాన్ బాహుబలి రికార్డ్ కొట్టింది రీసెంట్ టైం లో… ఇక టాప్ ప్లేస్ కి వస్తే…. బాహుబలి పార్ట్ 2 సినిమా…

282 సెంటర్స్ లో 50 డేస్ ని కంప్లీట్ చేసుకుని ఎపిక్ రికార్డ్ ను కొట్టింది. వీటిలో అన్ని సినిమాలు డైరెక్ట్ అండ్ షిఫ్ట్ సెంటర్స్ లో కలిపి ఈ రేంజ్ లో 50 రోజుల వేడుక ని జరుపుకున్నాయి. రీసెంట్ టైం లో మహర్షి సినిమా సెన్సేషనల్ రికార్డ్ ను నమోదు చేసింది అని చెప్పొచ్చు. బాహుబలి 2 తర్వాత హైయెస్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుక ని జరుపుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

Leave a Comment