గాసిప్స్ న్యూస్

లేటెస్ట్ బజ్…కొమరం భీమ్ టీసర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ విషయం లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేశారు, కానీ ఆ రోజు రిలీజ్ అవుతాయి అనుకున్న ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ మాత్రం అసలు రిలీజ్ అవ్వలేదు, అందులో అందరికీ భారీ షాక్ ఇచ్చింది మాత్రం రెండేళ్ళు గా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి చేసి రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న…

ఆల్ టైం బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా.. ఈ సినిమా లో రామ్ చరణ్ లుక్ అండ్ ఇంట్రో టీసర్ లు రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్ బర్త్ డే కు కూడా లుక్ అండ్ ఇంట్రో టీసర్ రిలీజ్ అవుతాయి అనుకున్నా లాక్ డౌన్ వలన….

అవి జరగడం లేడని యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది, ఇక ఫ్యాన్స్ కోపం తెచ్చుకున్నా చేసేదేమీ లేక ఊరుకున్నారు. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ కి పర్మీషన్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం. జూన్ 10 నుండి లిమిటెడ్ స్టాఫ్ తో షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది.

దాంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ టీసర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది లుక్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూపులు మళ్ళీ మొదలు పెట్టగా రోజుకో డేట్ వినిపిస్తుంది, లేటెస్ట్ బజ్ ప్రకారం, ఆగస్టు మొదటి సండే ఫ్రెండ్ షిప్ డే కి లుక్ రిలీజ్ అవుతుందని, దాని తర్వాత..

ఇంట్రో టీసర్ ని ఆగస్టు 15 న రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేస్తారని స్ట్రాంగ్ బజ్ ఉంది, యూనిట్ ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ని మరీ డిలే అయితే చేయరు కాబట్టి ఈ డేట్ కి అప్ డేట్ రావడం ఖాయమని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో అన్నది షూటింగ్స్ మొదలు అయిన తర్వాత ఉండే పరిస్థితుల పై ఆధార పడి ఉంటుందని చెప్పొచ్చు….

Leave a Comment