గాసిప్స్ న్యూస్

లోకల్ ఛానెల్ లో వకీల్ సాబ్….నిర్మాత ఎంత ఫైన్ వేశారంటే?

బాక్స్ అఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న వకీల్ సాబ్ సినిమా తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. సినిమా కి వస్తున్న రెస్పాన్స్ పవన్ పెర్ఫార్మెన్స్ వస్తున్న అప్లాజ్ అద్బుతంగా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేస్తున్న ఈ సినిమా ఒక పక్క సెకెండ్ వేవ్ ను ఎదురుకుంటూ ఉండగా మరో పక్క తగ్గిన టికెట్ రేట్లు…

మరో పక్క పైరసీ ను కూడా తట్టుకుంటూ జనాలను థియేటర్స్ కి రప్పిస్తుంది, ఇక సినిమా ఉన్న అడ్డంకులు చాలవు అన్నట్లు ఇప్పుడు పైరసీ ప్రింట్స్ ను కొందరు లోకల్ ఛానెల్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఏపీలోని విజయనగరంలో ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది.

సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే పైరసీ ప్రింట్ వచ్చేయగా ఆ రోజు సాయంత్రం కేబుల్ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. నిర్మాత దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇక నిర్మాత దిల్ రాజు ఈ విషయం తెలుసుకుని….

తగిన చర్చలు తీసుకుంటున్నారట. ఆ ఛానెల్ పై నష్టపరిహారం కేసు కింద 50 లక్షల ఫైన్ విదించబోతున్నారని సమాచారం, కానీ సదరు ఛానెల్ వాళ్ళు మాత్రం మేం సినిమా మొత్తం వేయలేదని ఒక నిమిషం క్లిప్ ను టీవీ లో చూపెట్టామంటూ కొన్ని న్యూస్ ఛానెల్స్ కి చెప్పారట. ఏది ఏమైనా పైరసీ ని ఎంకరేజ్ చేయడం తప్పు కాబట్టి… ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడటం కూడా ఖాయం అంటున్నారు.

ఇది వరకు కూడా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాలను ఇలా టెలివిజన్ లో రిలీజ్ అయిన రోజునే టెలికాస్ట్ చేయగా కొన్ని ఛానెల్స్ కి వార్నింగ్ లేదా పెనాల్టీ వేశారు. అయినా కానీ ఇదే రిపీట్ చేస్తూ వస్తున్నారు చాలా మంది, ఒక పక్క పైరసీ తో పాటు ఇలా లోకల్ ఛానెల్స్ కూడా పైరసీ ని ఎంకరేజ్ చేయడం విచారకరం…

Leave a Comment