గాసిప్స్ న్యూస్

వంశీ విజయ్ ని తెస్తే….బోయపాటి ఈ హీరోని రంగంలోకి దింపబోతున్నాడు!

  తెలుగు లో మార్కెట్ ని పెంచుకోవాలి అని కోలివుడ్ యాక్టర్స్ మొదటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఉన్న వాళ్ళలో కొందరు అనుకున్నట్లే తెలుగు లో ఒక స్టేబుల్ మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. మిగిలిన హీరోలు ట్రై చేస్తూనే ఉన్నారు. రీసెంట్ టైం లో తెలుగు లో సినిమా సినిమా కి సాలిడ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న హీరోగా ఇలయ దళపతి విజయ్ పేరు ముందు నిలుస్తుంది అని చెప్పొచ్చు.

కెరీర్ లో ఎప్పటి నుండో తెలుగు లో మార్కెట్ కోసం ట్రై చేసిన విజయ్ రీసెంట్ టైం లో అది సాధించి తన మార్కెట్ ని సాలిడ్ గా పెంచుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగు డైరెక్టర్ తో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ నే తీయడానికి రంగం సిద్హ్డం చేశాడు.

ఇలాంటి టైం లో వంశీ పైడిపల్లి విజయ్ కి కథ చెప్పి ఒప్పించి డైరెక్ట్ తెలుగు సినిమాకి ఒప్పుకునేలా చేశాడు. ఇదే టైం లో మరో డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఇప్పుడు మరో మాస్ ప్రయోగం చేయడానికి సిద్ధం అయ్యాడు అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్…

ఎప్పటి నుండో తెలుగు లో మీడియం రేంజ్ హీరోల లెవల్ లో మార్కెట్ ని సొంతం చేసుకున్నా కానీ స్టేబుల్ గా మార్కెట్ ని ఉంచుకోలేక పోయిన హీరో హీరోగా సూర్య నిలుస్తాడు అని చెప్పాలి. క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్నా సరైన సినిమాలు పడక మార్కెట్ కి దెబ్బ పడింది. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను అఖండ తర్వాత సూర్య తో…

తన స్టైల్ లో మాస్ మూవీ చేసే అవకాశం ఎంతైనా ఉందీ అన్నది లేటెస్ట్ టాక్, సింగం సిరీస్ తప్పితే రీసెంట్ టైం లో పెద్దగా కమర్షియల్ మూవీస్ చేయని సూర్య బోయపాటి చెప్పిన కథ లైన్ నచ్చడంతో ఓకే చెప్పాడు అన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఫుల్ కథ ఓకే అయితే సూర్య కూడా తెలుగు తమిళ్ లో ఈ సినిమా చేసే చాన్స్ ఉందని అంటున్నారు.

Leave a Comment