న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్….బ్రేక్ ఈవెన్ కి ఎంత కావాలంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇస్తున్న మూవీ వకీల్ సాబ్… మూడేళ్ళ తర్వాత బరిలోకి దిగుతున్న ఈ సినిమా తో పవర్ స్టార్ సంచలన కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడు. కాగా సినిమా పై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ ఉండగా బిజినెస్ ఆఫర్లు సాలిడ్ గా రాగా ముందు అనుకున్న బిజినెస్ కాకుండా ఇప్పుడు కొంచం బిజినెస్ తగ్గింది.. కర్ణాటకలో 50% ఆక్యుపెన్సీ చేయడం…

మహారాష్ట్రలో థియేటర్స్ ని మూసేయడం తో అక్కడ బిజినెస్ లు తగ్గగా, తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ మూడు మేజర్ ఏరియాల్లో సినిమాను నిర్మాతలు కొన్ని మెయిన్ సెంటర్స్ లో ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. దాని వర్త్ మొత్తం మీద 6 కోట్ల రేంజ్ వరకు ఉంటుందని సమాచారం.

నైజాం, వైజాగ్ మరియు సీడెడ్ లలో కొన్ని సెంటర్స్ లో ఓన్ రిలీజ్ కానుంది…. ఓన్ రిలీజ్ ను బిజినెస్ లో లెక్క చేయరు, అయినా కానీ మిగిలిన బిజినెస్ కూడా అల్టిమేట్ అనిపించే రేంజ్ లో జరిగింది, కరోనా తర్వాత టాలీవుడ్ నుండి హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది వకీల్ సాబ్ సినిమా…

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే..
👉Nizam: 23Cr
👉Ceeded: 12Cr
👉UA: 10Cr
👉East: 7Cr
👉West: 6Cr
👉Guntur: 7Cr
👉Krishna: 6Cr
👉Nellore: 3.35Cr
AP-TG Total:- 74.35CR
👉KA+ROI – 4Cr
👉OS – 5Cr
Total WW: 83.35Cr
సుమారు 6 కోట్ల వర్త్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో ఓన్ గా రిలీజ్ కానుండగా….

అది కూడా కలిపితే సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాలలోనే 80 కోట్లకు పైగా ఉంటుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ముందు అనుకున్న బిజినెస్ కన్ఫాం చేసి ఉంటే టోటల్ బిజినెస్ 92 కోట్లకు పైగా జరిగి ఉండేది… ప్రస్తుత పరిస్థితుల వలన బిజినెస్ తగ్గగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీ అయిందని చెప్పొచ్చు. సినిమా బాక్సాఫీసు దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే 84 కోట్ల షేర్ ని సాధిస్తే సరిపోతుంది…

Leave a Comment