న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్ బడ్జెట్ ఎంత, టోటల్ బిజినెస్ ఎంత…నిర్మాతకి లాభమా నష్టమా!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్, 9 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా క్రేజ్ కూడా అదే రేంజ్ లో మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఇక సినిమా సాధించిన టోటల్ బిజినెస్ లెక్కలు బయటికి వచ్చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర మొదలు అవ్వాల్సి ఉంది.

సినిమా మొత్తం మీద బడ్జెట్ 65 కోట్ల రేంజ్ లో జరిగిందని సమాచారం. అందులో పవర్ స్టార్ రెమ్యునరేషన్ కిందే ఏకంగా 45 కోట్ల వరకు వెళ్లిందని, తర్వాత ఓవరాల్ బిజినెస్ మీద ప్రాఫిట్ షేర్ ఉందని సమాచారం. దాంతో సినిమా మొత్తం 20 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే పూర్తీ అయింది.

ఇక సినిమా మొత్తం మీద 83.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, మిగిలిన బిజినెస్ లెక్కలు కూడా బయటికి వచ్చాయి. కాగా సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 32 కోట్ల రేటు ను సొంతం చేసుకుందని సమాచారం. ఇక మ్యూజిక్ రైట్స్ కింద సినిమా…

1.5 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా ఓవరాల్ బిజినెస్ ఇప్పుడు 116.85 కోట్ల వరకు జరిగింది…..ఓన్ రిలీజ్ కూడా కలిపితే ఈ లెక్క మొత్తం మీద 123.5 కోట్ల దాకా వెళుతుంది, దాంతో పెట్టిన బడ్జెట్ 65 కోట్ల కి సినిమా ఇక్కడే 52 నుండి 56 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా, హిందీ డబ్బింగ్ బిజినెస్ ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయని తెలుస్తుంది.

కానీ ఇంకా నిర్మాతలు ఏవి కూడా ఓకే చేయలేదని తెలుస్తుంది. సో అది పక్కకు పెట్టిన పవర్ స్టార్ ఒక సీరియస్ మూవీ రీమేక్ తోనే ఈ రేంజ్ ప్రాఫిట్స్ ను నిర్మాతలకు అందించాడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రేట్లు పెట్టి కొన్న బయ్యర్స్ కి ఎలాంటి ప్రాఫిట్స్ ని ఇస్తుంది అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది..

Leave a Comment