న్యూస్

వకీల్ సాబ్ సెన్సార్ టాక్….సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే??

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధం అవుతుంది, మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోవడానికి అనేక మార్పులు చేర్పులతో రాబోతుంది, పింక్ మూవీ కి రీమేక్ అయినా ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు.

దాంతో సినిమా లెంత్ కూడా పెరిగి ఇప్పుడు మొత్తం మీద 2 గంటల 35 నిమిషాల లెంత్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకోగా అక్కడ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ ఏంటి అనేది కూడా బయటికి వచ్చింది.

ఆ టాక్ ప్రకారం సినిమా రీమేక్ అయినా ఒరిజినల్ మెయిన్ కోర్ పాయింట్ ని ఏమాత్రం మార్చకుండా అమితాబ్ రోల్ ని కంప్లీట్ గా మర్చి ఇక్కడ పవన్ కి ఫ్లాష్ బ్యాక్, అందులో ఒక లవ్ స్టొరీ, కొన్ని కారణాల వల్ల లాయర్ జాబ్ చేయకుండా గడ్డాలు మీసాలు పెంచిన హీరో…

అనుకోకుండా ఓ ముగ్గురు అమ్మాయిలపై మోపిన ఓ కేసులో నుండి వాళ్ళని బయటపడేయడానికి తిరిగి లాయర్ అయ్యాక  జరిగిన పరిణామాలు ఏంటివి అన్నవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు. పవర్ స్టార్ కంబ్యాక్ మూవీ కాబట్టి… కథ లో గ్యాప్ దొరికిన ప్రతీ చోట మాస్ ఎలిమెంట్స్ ని ఫ్యాన్స్ కోరుకునే సన్నివేశాలను బాగా సెట్ చేశారని అంటున్నారు.

ఓవరాల్ గా సెన్సార్ నుండి ఫైనల్ గా వినిపిస్తున్న టాక్. పింక్ లా కోర్ పాయింట్ సీరియస్ గానే ఉన్నా మిగిలిన సీన్స్ అన్నీ కూడా కమర్షియల్ టచ్ తో రూపొందాయని అంటున్నారు. అది ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతాయి అన్నదానిపై సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో అన్నది చెప్పగలం అని అంటున్నారు. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Leave a Comment