న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్ @ 122….పవర్ స్టార్ ఊరమాస్ మ్యానియా ఇది!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ జోరును సెకెండ్ వేవ్ అండ్ ఆంధ్రలో అనేక అవరోధాలను ఎదురుకుంటూ కూడా స్టడీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది… సినిమా 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా 113 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా….

6 వ రోజు కూడా బాగా హోల్డ్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 120 కోట్ల మార్క్ ని అధిగమించ బోతుంది. ఫైనల్ లెక్కలు అన్నీ అనుకూలంగా ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల కలెక్షన్స్ తో ఇప్పుడు….

122 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. 4 వ రోజు డ్రాప్స్ గట్టిగానే ఉన్నప్పటికీ 5 వ రోజు ఉగాది హాలిడే అండ్ 6 వ రోజు అంబేద్కర్ జయంతి హాలిడేస్ ను సాలిడ్ గా ఎంజాయ్ చేసిన సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చింది అని చెప్పాలి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి మరో అడ్వాంటేజ్ కూడా లభించ బోతుంది, రెండో వారం కానీ మూడో వారం కానీ పోటి లో ఒకటి రెండు చిన్న సినిమాలు తప్పితే బాక్స్ ఆఫీస్ దగ్గర వకీల్ సాబ్ ను అడ్డుగా నిలిచే సినిమా ఏది కూడా ఈ నెల ఎండ్ వరకు లేదనే చెప్పాలి. దాంతో సినిమా కి లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర…

సూపర్ సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉండగా ఈ అడ్వాంటేజ్ ను సినిమా ఎంతలా వాడుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. పింక్ లాంటి రీమేక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

Leave a Comment