న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్ 4 వ రోజు కలెక్షన్స్…ఇది మామూలు దెబ్బ కాదు!!

బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ మూవీ మొదటి వీకెండ్ ను అల్టిమేట్ కలెక్షన్స్ తో ముగించింది, అనేక అవరోధాలను ఎదురుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వీకెండ్ ను ముగించగా సినిమా కి రెండో రోజు తో పోల్చితే మూడో రోజు టికెట్ రేట్లు ఆంధ్రలో చాలా చోట్ల తగ్గించడం లాంటివి కలెక్షన్స్ పై…

ఇంపాక్ట్ గట్టిగా చూపాయి. ఇక సినిమా 4 వ రోజు అఫీషియల్ వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా, డే 4 నుండి అన్ని సెంటర్స్ లో టికెట్ రేట్లు ఆంధ్ర లో మరింత తక్కువగా ఉండటం తో కొన్ని చోట్ల బుకింగ్స్ ను ఆపేశారు. ట్రాకింగ్ లేని మాస్ సెంటర్స్ లో బుకింగ్స్ ను ఆపేసి…

ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ చేస్తుండగా షేర్ ని మాత్రం ప్రభుత్వం చెప్పిన రేట్ల ప్రకారమే చూపబోతున్నారు. దాంతో 4 వ రోజు ఆంధ్రలో కలెక్షన్స్ చాలా తగ్గే అవకాశం కనిపిస్తుంది, ఇక నైజాం లో సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలకు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 60% వరకు సొంతం చేసుకోగా…

ఆంధ్రలో కొన్ని చోట్ల బాగానే హోల్డ్ చేసినా చాలా చోట్ల డ్రాప్స్ ఉన్నాయి. దాంతో అవన్నీ ఇప్పుడు 4 వ రోజు కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపబోతున్నాయి. దాంతో సినిమా ఇప్పుడు 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కొంచం గ్రోత్ చూపి…

5 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద టికెట్ రేట్ల వలన ఎదురుదెబ్బలు తగులుతున్నా సినిమా స్టడీగానే ఉంది, ఇక 5 వ రోజు 6 వ రోజు వరుస హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సినిమా బాక్స్ ఆఫీస్ జోరు మరింత జోరుగా కొనసాగే అవకాశం ఉంది, ఇక 4 వ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక.

Leave a Comment