న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్….5 వ రోజు బాక్స్ ఆఫీస్ ఊచకోత!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అద్బుతంగా జోరు చూపింది, 4 వ రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన డ్రాప్స్ గట్టిగా ఉన్నప్పటికీ 5 వ రోజు ఉగాది హాలిడే అడ్వాంటేజ్ తో సినిమా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. సినిమా కి ఆంధ్రలో టికెట్ రేట్లు భారీగా తగ్గించడం ఎఫెక్ట్ అయ్యింది కానీ లేకుంటే సినిమా అవలీలగా 10 కోట్లకు పైగా షేర్ ని…

మినిమమ్ సొంతం చేసుకుని ఉండేది. సినిమా 5 వ రోజు మొత్తం మీద తగ్గించిన రేట్ల వల్ల ఎఫెక్ట్ అయినా కానీ ఓవరాల్ గా 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 8.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. దాంతో టాలీవుడ్ లో 5 వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన వకీల్ సాబ్ సినిమా అనేక అవరోధాలను ఎదురుకుంటూ కూడా దుమ్ము లేపుతూ ఉండటం విశేషం. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

👉Nizam: 20.46Cr
👉Ceeded: 10.74Cr
👉UA: 9.78Cr
👉East: 5.47Cr
👉West: 6.16Cr
👉Guntur: 6.18Cr
👉Krishna: 4.17Cr
👉Nellore: 2.91Cr
AP-TG Total:- 65.86CR (100.70Cr~ Gross)
KA+ROI – 3.48Cr (Corrected)
OS- 3.61Cr (Corrected)
Total WW: 72.95CR(113.35Cr~ Gross)
ఇవీ సినిమా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.

సినిమాను టోటల్ గా 89.35 కోట్లకు అమ్మగా సినిమా 90 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా మరో 17.05 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 6 వ రోజు కూడా హాలిడేనే కాబట్టి సినిమా మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment