న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్@700+…ఇండియన్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ ఇది!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న మూవీ వకీల్ సాబ్, సాలిడ్ అంచనాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ వ్యూస్ అండ్ లైక్స్ తో సినిమా పై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయి అని చెప్పాలి.

దాంతో ఇంకా సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు అత్యంత భారీ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.. తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ రిలీజ్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా సినిమా ఇప్పుడు…

ఆల్ టైం రికార్డ్ లెవల్ లో పాండమిక్ తర్వాత రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్నీ నిర్మాత అఫీషియల్ గా అప్ డేట్ చేశారు. ఎంటైర్ ఓవర్సీస్ లో ఇప్పుడు ఈ సినిమా ఆల్ మోస్ట్ 700 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. దాంతో పాండమిక్ తర్వాత ఇండియా నుండి…

ఓవర్సీస్ లో హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డ్ ను ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా సొంతం చేసుకోబోతుంది. ఇక ఒక్క అమెరికాలోనే ఈ సినిమా మొత్తం మీద 265 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా నార్మల్ టికెట్ రేటు 10$ అలాగే ప్రీమియర్స్ కి 14$ గా టికెట్ రేటు ని కన్ఫాం చేశారు.

దాంతో ప్రీమియర్స్ నుండే సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడిప్పుడే స్టేబుల్ అవుతూ ఉండగా ఇప్పుడు వకీల్ సాబ్ భారీ లెవల్ లో రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రీమియర్స్ నుండే సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

Leave a Comment