గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్@75 కోట్లు…టాలీవుడ్ మొత్తం షాక్!!

2020 ఇయర్ లో ప్రస్తుతం జరుగుతున్న ఇబ్బందులు ఏవి జరగకుండా ఉండి ఉంటే… ఈ పాటికే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి రోజు కలెక్షన్స్ అప్ డేట్స్ తో అంతటా దుమ్ము లేపుతూ ఉండేది, కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోగా… అవి ఎప్పుడు తిరిగి మొదలు అవుతాయి…..

తిరిగి థియేటర్స్ ఎప్పుడు రీ ఓపన్ అవుతాయి లాంటి విషయాలు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు, ఇదే టైం లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా లకు భారీ స్ట్రీమింగ్ రైట్స్ ఆఫర్స్ ఇస్తున్న టాప్ OTT యాప్స్ చూపు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై కూడా పడింది.

ఈ సినిమా ను కూడా భారీ రేటు చెల్లించి కొనడానికి సిద్ధం అయ్యాయి, అందులో భాగంగా సినిమా కి తెలుగు సినిమాల్లో మరే సినిమా కి ఇవ్వనంత రేంజ్ లో 75 కోట్ల రేంజ్ లో రేటు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది, పవర్ స్టార్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్…

మినిమమ్ 80 నుండి 90 కోట్ల రేంజ్ లో జరగడం ఖాయం.. అజ్ఞాతవాసి రేంజ్ కూడా చూసుకుంటే 120 కోట్లకు వెళుతుంది. కానీ రీ ఎంట్రీ అండ్ లిమిటెడ్ బడ్జెట్ లో పవన్ చేసే స్పెషల్ క్యామియో ని దృష్టి లో పెట్టుకున్నా 80 కోట్ల రేంజ్ బిజినెస్ మినిమమ్ ఉంటుందని చెప్పొచ్చు. డానికి కొంచం తక్కువగా 75 కోట్ల రేంజ్ లో ఆఫర్ ని OTT యాప్స్ ఇస్తున్నాయట.

కానీ యూనిట్ మాత్రం నో అని సింపుల్ గా చెప్పేశాయి అంటున్నారు. లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోయిందని, లాక్ డౌన్ తర్వాత షూటింగ్ చేసి అంతా సద్దుకున్నాకే థియేటర్స్ లోనే సినిమా రిలీజ్ ఉంటుందని కన్ఫాం చేశాయట. దాంతో ఈ ఆఫర్ చూసి టాలీవుడ్ షాక్ అయినా టీం ఓకే చెప్పక పోవడం తో ఊపిరి పీల్చుకున్నాయి. ఓకే అంటే వరుస పెట్టి ఇతర సినిమా లు కూడా క్యూ కట్టే అవకాశం ఉండేది..

Leave a Comment