గాసిప్స్ న్యూస్

వన్స్ మోర్…చిరు బ్లాక్ బస్టర్ రీమేక్…చక్కదిద్దుతున్న సుకుమార్!!

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత సైరా తో మెప్పించినా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి పెట్టిన బడ్జెట్ రేంజ్ లో అయితే వసూళ్లు అందుకోలేక పోయాడు, దాంతో అక్కడ తగ్గిన కలెక్షన్స్ కూడా ఇప్పుడు ఆచార్య తో రాబట్టాల్సిందే అని ప్రిపేర్ అవ్వగా ఈ సినిమా తర్వాత ముందు లూసిఫర్ రీమేక్ అనుకున్నా ఇప్పుడు వేదాలం రీమేక్ కి సై అన్న విషయం తెలిసిందే.

కాగ ఈ రీమేక్ ని ఎప్పుడో 2013 లో చివరి సారి డైరెక్షన్ చేసిన మెహర్ రమేష్ కి అప్పగించిన మెగాస్టార్ మెహర్ పై నమ్మకం పెట్టినా కానీ స్క్రిప్ట్ లో చేసిన మార్పులు చేర్పులు తనవరకు బాగా నచ్చగా 3rd పర్సన్ ఒపీనియన్ తీసుకోవాలని మరోసారి…

డైరెక్టర్ సుకుమార్ కి స్క్రిప్ట్ ని పంపించారట. ఇది వరకు సుజీత్ లూసిఫర్ సినిమా కి తెలుగు వర్షన్ మార్పులు చేయగా ఆ చేంజెస్ ని కూడా సుకుమార్ కి పంపగా అందులో సుకుమార్ చాలా లోటు పాట్లు వెతికారు, దాంతో అనుకోకుండా ఆ సినిమా చేతులు మారడం ఇప్పుడు కంప్లీట్ గా…

డిలే అవ్వడం జరిగిన విషయం తెలిసిందే, ఇంకా పుష్ప షూటింగ్ ని మొదలు పెట్టని సుకుమార్ ప్రస్తుతం ఇతర సినిమాలకు కథలను వెబ్ సిరిస్ లకు కథలను ప్రిపేర్ చేస్తూ ఉండగా మరోసారి చిరు నుండి వచ్చిన వేదాలం రీమేక్ స్క్రిప్ట్ కి కొన్ని తుది మెరుగులు లోటు పాట్లు చక్కదిద్దే పనిలో ఉన్నారు అనేది …..

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. ఈ మంత్ ఎండ్ వరకు సుకుమార్ ఈ పనులను కంప్లీట్ చేసుకుని పుష్ప షూటింగ్ మొదలు పెట్టె పనిలో ఉంటారని అంటున్నారు. ఈ గ్యాప్ లో చిరు వేదాలం రీమేక్ కి తనదైన మార్క్ చూపెట్టి ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పనులు పూర్తీ అయితే దసరా కి సినిమాను మొదలు పెట్టె అవకాశం ఉందని అంటున్నారు….

Leave a Comment