న్యూస్ స్పోర్ట్స్

వరల్డ్ కప్ మ్యాచ్ 1: సౌత్ఆఫ్రికా ని చిత్తు చేసిన ఇంగ్లాండ్

వరల్డ్ కప్ మొదలు అయింది, మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి సౌత్ఆఫ్రికా కి మధ్య పోటి రసవత్తరంగా సాగుతుంది అనుకున్నా వన్ సైడ్ మ్యాచ్ అయిపొయింది, ఇంగ్లాండ్ రెండో బాల్ కే బెయిర్ స్టో వికెట్ ని కోల్పోయినా కానీ జాసర్ రాయ్ మరియు జో రూట్, ఇయాన్ మోర్గాన్ లు ఆఫ్ సెంచరీ లతో మ్యాచ్ ని నిలబెట్టగా స్ట్రోక్స్ ఆల్ రౌండ్ షో తో ఆకట్టుకున్నాడు.

మొత్తం మీద ఇంగ్లాండ్ 50 ఓవర్స్ లో 311 పరుగులు చేయగా 312 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఎ దశలో కూడా పోటి ఇవ్వలేకపోయింది, ఒక్క డికాక్ మాత్రమె ఆకట్టుకోగా టోటల్ గా సౌత్ ఆఫ్రికా 207 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆర్చర్ 3 వికెట్లు, స్ట్రోక్, ప్లంకెట్ లు చెరో 2 వికెట్ల తో సౌత్ఆఫ్రికా వెన్ను విరిచారు. ఆల్ రౌండ్ షో తో ఆకట్టుకున్న స్ట్రోక్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Leave a Comment