న్యూస్ బాక్స్ ఆఫీస్

వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్స్: ఫస్ట్ డే 6 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది!!

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అందుకోవడం లో విఫలం అయింది, క్లాస్ సెంటర్స్ వరకు సినిమా మొదటి రోజు జోరు చూపినా మాస్ సెంటర్స్ లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేదు, దాంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అందుకోలేక పోయిన సినిమా నిరాశ పరిచే కలెక్షన్స్ ని ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా సాధించింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 6 కోట్ల రేంజ్ షేర్ ని రాబడుతుంది అనుకున్నా కేవలం 4.4 కోట్ల రేంజ్ షేర్ తోనే సరి పెట్టుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కేవలం 5.53 కోట్ల షేర్ నే అందుకుంది.

మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.09Cr
?Ceeded: 38L
?UA: 52L
?East: 31L
?West: 24L
?Guntur: 43L
?Krishna: 25L
?Nellore: 18L
AP-TG Total:- 4.40CR
Ka & ROI: 0.48Cr
OS: 0.65L
Total WW: 5.53CR(9.20Cr Gross)

ఇదీ సినిమా ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్. సినిమా ను బాక్స్ అఫీస్ దగ్గర 30.5 కోట్లకు అమ్మగా సినిమా 31.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు మొత్తం మీద 5.53 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో మరో…

25.67 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఈ రోజు రేపు భారీ లెవల్ లో గ్రోత్ ని సాధించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ కి ఎంతో కొంత అవకాశం ఉంటుంది, లేకపోతె భారీ నష్టాలు సొంతం చేసుకోవడం ఖాయం. ఇక రెండో రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment