Home న్యూస్ వరల్డ్ ఫేమస్ లవర్ డే 1 కలెక్షన్స్…మాస్…ఊరమాస్ కలెక్షన్స్!!

వరల్డ్ ఫేమస్ లవర్ డే 1 కలెక్షన్స్…మాస్…ఊరమాస్ కలెక్షన్స్!!

249
0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో వాలెంటైన్స్ రోజున సాలిడ్ కలెక్షన్స్ తో అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో కూడా దుమ్ము లేపే ఓపెనింగ్స్ తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అవుతుంది, సినిమా ఫస్ట్ డే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి వచ్చే సరికి 50 టు 55% ఆక్యుపెన్సీ తో రన్ అయింది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి 65% టు 70% వరకు ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, కొన్ని మాస్ సెంటర్స్ లో మాత్రం డ్రాప్స్ పడ్డాయి. కానీ ఓవరాల్ గా క్లాస్ అండ్ మల్టీ ప్లేక్సులలో సినిమా సాలిడ్ గా దూసుకు పోయింది.

ఇక పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు తేలాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న స్టేటస్ ని బట్టి చూస్తుంటే 6 కోట్ల మార్క్ ని దాటిపోవడం ఖాయంగా కనిపిస్తుంది, పూర్తీ లెక్కలు అనుకున్నట్లు ఉంటె 6.5 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

ఇక సినిమా ప్రీమియర్ షోలతో 1 లక్ష డాలర్స్ ని వసూల్ చేయగా మొదటి రోజు వసూళ్ళతో కలిపి 150K మార్క్ ని అందుకోవడం పక్కా అని చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు ఇప్పుడు 8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునేలా ఉందని చెప్పాలి. ఇతర భాషల్లో ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించేలా ఉండటంతో…

వాటి ఈవినింగ్ అండ్ నైట్ షోల స్టేటస్ లు బెటర్ గా ఉంటె టోటల్ గా మొదటి రోజు 8.2 కోట్ల నుండి 8.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు. సినిమా మొత్తం మీద మొదటి రోజు అన్ సీజన్ లో కూడా దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుంది. ఇక అఫీషియల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఎ విధంగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here